Nani vs Ram Charan : ఈమధ్య కాలం లో నాని తన ప్రతీ సినిమాతో తన మార్కెట్ పరిధి ని ఎలా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన నాని(Natural Star Nani), ఈ స్థాయికి ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. దసరా , సరిపోదా శనివారం, హిట్ 3 వంటి చిత్రాలతో మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్న నాని, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో కుంభస్థలం బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తనకు ‘దసరా’ వంటి సూపర్ హిట్ ని అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తో భారీ బడ్జెట్ తో తన సొంత నిర్మాణ సంస్థలో ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే చిత్రం చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు షూటింగ్ కార్యక్రమాలు జరుపుకోకుండా స్తబ్దుగా ఉన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతుంది.
నేడు ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేస్తున్న రాఘవ్ జ్యోయెల్ లుక్ ని విడుదల చేశారు. ఇతను హిందీ లో గత ఏడాది సంచలన విజయం సాధించిన ‘కిల్’ అనే చిత్రం లో విలన్ గా నటించాడు. శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ ని ఎంత క్రూరంగా చూపిస్తాడో ఒక అవగాహనా వచ్చింది. ‘ప్యారడైజ్’ చిత్రం లో కూడా విలన్ క్యారక్టర్ ని అంతే క్రూరంగా చూపించబోతున్నాడట. అంతే కాదు ఈ సినిమా ద్వారా రాఘవ్ కి తెలుగు లో మంచి బ్రేక్ కూడా దొరుకుంటుంది అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల చేయబోతున్నాము అంటూ మేకర్స్ ఇది వరకు గ్లింప్స్ వీడియో ద్వారా అధికారిక ప్రకటన చేశారు. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద రచ్చ నే జరిగింది.
ఎందుకంటే రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) చిత్రం మార్చి 27 న విడుదల కాబోతుంది కాబట్టి. ఒక్క రోజులో రెండు పాన్ ఇండియన్ చిత్రాలు విడుదల అయితే కచ్చితంగా రెండు సినిమాలకు నష్టం తప్పవు అనేది అందరికీ తెలిసిందే. కచ్చితంగా నాని ‘ప్యారడైజ్’ చిత్రం తప్పుకుంటుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే షూటింగ్ ఆలస్యం అయ్యింది కాబట్టి. కానీ ఇప్పుడు ప్లాన్ ప్రకారం నాన్ స్టాప్ గా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సినిమాని మార్చి 26 న విడుదల చేస్తున్నాము అని మరో సారి క్లారిటీ ఇచ్చాడు. అంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నమాట. మరి ఇప్పుడు రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్నాయా?, లేదా రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం వేరే ఏదైనా మంచి డేట్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుందా అనేది చూడాలి.