India vs England : లార్డ్స్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో రెండవ రోజైన శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు 260/4 వద్ద పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. మిగతా ఆరు వికెట్లను 127 పరుగులు జోడించి కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టులో రూట్(104), కార్సే (56), స్మిత్(56), పోప్(44), స్టోక్స్(44) పరుగులు చేశారు. రూట్ బుమ్రా వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కార్సే జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. స్మిత్ ను సిరాజ్ వెనక్కి పంపించాడు. కార్సే ను సిరాజ్ క్లీన్ బౌల్ట్ చేశాడు. కార్సే, స్మిత్ ఎనిమిదో వికెట్ కు 84 పరుగు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సిరాజ్ విడదీశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు మిగతా వికెట్లు కోల్పోవడానికి పెద్ద సమయం పట్టలేదు.
వాస్తవానికి ఇంగ్లాండ్ 387 పరుగులు చేసేది కాదు. ఎందుకంటే రెండో రోజు ఆట ప్రారంభంలో భారత బౌలర్లు అదరగొట్టారు. కొత్త బంతితో స్టోక్స్, రూట్, వోక్స్ వికెట్లను బుమ్రా పడగొట్టాడు. అయితే ఆ తర్వాత బంతి పాతగా మారడంతో కొత్తది ఇవ్వాలని భారత ఆటగాళ్లు కోరారు. అయితే దానికి అంపైర్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఒకవేళ భారత ఆటగాళ్లు చెప్పినట్టు అంపైర్ గనుక కొత్త బంతి ఇచ్చినట్టయితే ఇంగ్లాండ్ జట్టు 320 పరుగుల వరకు ఆలౌట్ అయ్యేది. పాత బంతి కావడంతో స్మిత్, కార్సే దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 84 పరుగులు జోడించారు. అది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు చోదక శక్తి లాగా మారింది. లేకుంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 320 పరుగుల వద్ద ముగిసేది.
ఇక తొలి టెస్ట్ లో కూడా టీమిండియా కీపర్ రిషబ్ పంత్ బంతి విషయంలో ఇలాగే అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు.. ఈ క్రమంలో అతనిపై చర్యలు తీసుకుంటారని వార్తలు వినిపించాయి. అతడు మ్యాచ్ ఆడేది అనుమానమేనని వ్యాఖ్యలు వినిపించాయి. కాని చివరికి అతడిని మందలించారు. అయితే ఇప్పుడు కెప్టెన్ గిల్ విషయంలో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. మరోవైపు కొత్త బంతి వచ్చిన తర్వాత టీం ఇండియా బౌలర్లు రెచ్చిపోయారు. భోజనం తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి అదరగొట్టారు.. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు బెదిరి పోయారు.
ఎప్పుడైతే స్మిత్ ఔట్ అయ్యాడో.. మిగతా బ్యాటర్లు అవుట్ కావడానికి పెద్ద సమయం పట్టలేదు. భోజనం తర్వాత సిరాజ్ రెచ్చిపోయాడు. అద్భుతమైన బంతులు వేసి ఇంగ్లాండ్ బ్యాటర్ల పనిపట్టాడు. మరోవైపు బుమ్రా కూడా చెలరేగిపోయాడు. పదునైన బంతులు వేసి తను ఎంత ప్రత్యేకమైన బౌలరో నిరూపించుకున్నాడు. తద్వారా ఇంగ్లాండ్ పై తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు.