Nani sujeeth movie : ఈ మధ్య కాలం లో యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాత సినిమా టైటిల్స్ ని, లేదా ఆయన సినిమాల్లోని చార్ట్ బస్టర్ సాంగ్స్ లోని పాపులర్ లైన్ తో తమ సినిమాలకు టైటిల్స్ గా పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా అదే అనుసరిస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలోనే నాని(Natural Star Nani), సుజిత్(Sujeeth) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది ఈ చిత్రం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుండి జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి ‘Guns N Roses’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఈ టైటిల్ ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ఓజీ చిత్రం లోని థీమ్ సాంగ్ కి సంబంధించిన లైన్.
సినిమాలో పోలీస్ స్టేషన్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా నడుచుకుంటూ వచ్చేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది. తన సినిమాలోని పాటకు సంబంధించిన లైన్ ని తన తదుపరి సినిమాకు సుజిత్ పెట్టుకోబోతున్నాడు అంటే సాహసం అనే చెప్పాలి. కానీ ఈ చిత్రానికి మరో టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ టైటిల్ ‘బ్లడీ రోమియో’ అట. ఇది కూడా ఓజీ లాగానే ఒక గ్యాంగ్ స్టర్ సినిమా అంటూ డైరెక్టర్ సుజిత్ ఇది వరకే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే సుజిత్ ‘ఓజీ 2’ పనులు మొదలు పెడుతాడట. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ ని జనవరి నెలాఖరు లోపు పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. కానీ షూటింగ్ మాత్రం అంత వేగంగా జరగడం లేదని సమాచారం. ఈ సినిమా తో సంబంధం లేకుండా ఈ నెల నుండే సుజిత్ చిత్రాన్ని ప్రారంభించేందుకు నాని రెడీ గా ఉన్నాడట. వాస్తవానికి ఈ ప్రొజెక్ట్ ని DVV దానయ్య బ్యానర్ లోనే నిర్మించాలని అనుకున్నారు. ఓజీ గ్లింప్స్ విడుదలైన కొత్తల్లోనే, ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కి కూడా విడుదల చేశారు మేకర్స్. కానీ నిర్మాతతో సుజిత్ కి ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా ఈ ప్రాజెక్టు నుండి DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తప్పుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ని నాని తన సొంత బ్యానర్ పై నిర్మించబోతున్నాడు.
