‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) సీజన్ సరిగ్గా 13 వ వారం లోకి అడుగుపెట్టింది. గత సీజన్స్ లో 13వ వారం లోకి వచ్చినప్పుడు నామినేషన్స్ ఎంత ఫైర్ వాతావరణం మధ్య నడిచేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సీజన్ లో 13వ వారం నామినేషన్స్ అత్యంత కామెడీ గా ఉండబోతున్నాయి. కంటెస్టెంట్స్ కి ఒకరి పై ఒకరికి సరైన పాయింట్స్ లేవు. చాలా సిల్లీ నామినేషన్స్ చేసుకున్నారు. ముఖ్యంగా సుమన్ శెట్టి ఈరోజు చేసిన నామినేషన్ ని చూసి హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వారమే కాదు, సుమన్ శెట్టి ప్రతీ వారం ఇలాంటి పేలవంతమైన నామినేషన్స్ పాయింట్స్ తో ప్రేక్షకులకు బీపీ తెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. పైగా ఆయన పెట్టే సిల్లీ పాయింట్స్ ని గట్టిగా అరిచి చెప్తుంటాడు.
నేటి నామినేషన్స్ లో ఆయన డిమోన్ పవన్ ని నామినేట్ చేస్తూ ‘నీకు ఆరోగ్యం బాగాలేదు. నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం, అందుకే నామినేట్ చేస్తున్నా’ అని అంటాడు. ఆయన ఈ మాట అనగానే ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి, భరణి, తనూజ వంటి వారు పగలబడి నవ్వుకుంటారు. అందుకు సుమన్ శెట్టి ‘నవ్వుతారు ఏంటయ్యా’ అని అంటాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ పైగా టికెట్ టు ఫినాలే ఉంది..నువ్వు ఫిజికల్ గా మా అందరికంటే స్ట్రాంగ్’ అని అంటాడు. అప్పుడు డిమోన్ పవన్ ‘స్ట్రాంగ్ కంటెస్టెంట్ కప్ కొట్టాలి కానీ ఇంటికి వెళ్లిపోకూడదు అన్నా..పాపం నీకు నా ఆరోగ్యం పట్ల చాలా బాధ ఉన్నట్టు ఉంది. సంతోషం’ అని అంటాడు. ఆరోగ్యం బాగాలేదు ఇంటికి వెళ్ళిపో అంటాడు, మళ్లీ నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్ అని అంటాడు, 13 వ వారం నామినేషన్స్ లో పెట్టాల్సిన పాయింట్స్ ఇవేనా?.
ఇదంతా పక్కన పెడితే సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, టాస్కులు ఆడలేదు, నామినేషన్స్ సమయం లో పాయింట్స్ కూడా పెట్టలేడు, అయినప్పటికీ కేవలం తన అమాయకత్వం తో ఈ సీజన్ లో ఆయన 13 వ వారం వరకు కొనసాగాడు. ఆయనకంటే తోపు కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. ఏమి చేయకుండా, సైలెంట్ గా కూర్చున్నా కూడా 13 వారాలు లాగేయొచ్చు అని సుమన్ శెట్టి నిరూపించి చూపించాడు. అయితే ఇక ఆయనకు ఈ రియాలిటీ షో లో సమయం పూర్తి అయ్యింది. గత వారం లోనే ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఇక ఈ వారం అస్సాం ట్రైన్ లో స్లీపర్ భోగి ఫిక్స్ అయిపోయినట్టే.