https://oktelugu.com/

డబ్బింగ్ మొదలైంది.. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌ గా వస్తాడట !

నేచుర‌ల్ స్టార్ నాని భారీ ఆశలు పెట్టుకున్న ‘వి’ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా నిరాశ పరిచింది. సినిమాలో నాని నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందంటేనే.. నానికి ఈ సినిమా ఎంతలా మైనస్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే వచ్చిన భారీ పరాజయాన్ని త్వరగా మర్చిపోయేలా.. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నాని. ప్రస్తుతం ‘నిన్నుకోరి’ వంటి మంచి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ‘టక్ జగదీశ్’ […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 10:15 AM IST
    Follow us on


    నేచుర‌ల్ స్టార్ నాని భారీ ఆశలు పెట్టుకున్న ‘వి’ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా నిరాశ పరిచింది. సినిమాలో నాని నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందంటేనే.. నానికి ఈ సినిమా ఎంతలా మైనస్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే వచ్చిన భారీ పరాజయాన్ని త్వరగా మర్చిపోయేలా.. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నాని. ప్రస్తుతం ‘నిన్నుకోరి’ వంటి మంచి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ‘టక్ జగదీశ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ ను చేస్తున్నాడు. నిన్నటి నుండి ఈ మూవీ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మయ్యాయి. మొదట నాని తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. డైలాగ్ లో విషయం లేకపోయినా.. నాని తన మాడ్యులేషన్ తోనే అద్భుతంగా డైలాగ్ ను పడించగలడు.

    Also Read: మహేష్ కి ‘రేణూ దేశాయ్’ వదిన కాదు, అక్కే !

    కాగా ఈ సినిమాలో నాని సరసన రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. అందుకే, మేకర్స్ మరింత ఉత్సాహంగా ఈ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డారు. అన్నిటికిమించి ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

    Also Read: చెల్లెమ్మా.. తస్మాత్ జాగ్రత్త – ఎన్టీఆర్

    పైగా ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండటం కూడా సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకాన్ని పెంచుతుంది. ఇక ఈ సినిమాలో ఇతర తారాగ‌ణం విషయానికి వస్తే.. జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నారు. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్