Happy Independence Day 2024 : దేశ విభజన నుంచి పాకిస్థాన్ కు స్వాతంత్రం వరకు ముఖ్య విషయాలివిగో..

ఆగస్ట్ 14కు చరిత్రలో ఒక గుర్తింపు ఉంది. 1947లో బ్రిటీష్ పాలకులు దేశాన్ని విభజించారు. ఈ కారణంగా ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అయితే 2021లో ప్రధాని ఈ రోజును దేశ విభజన బ్లాక్ డే అభివర్ణించారు.

Written By: Srinivas, Updated On : ఆగస్ట్ 14, 2024 1:15 సా.

Partition Of India

Follow us on

Happy Independence Day 2024 : ప్రపంచ చరిత్రలోనే ఆగస్ట్ 14కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజును ప్రస్తుత ప్రధాని మోడీ బ్లాక్ డేగా అభివర్ణించారు. 1947లో నాటి బ్రిటీష్ పాలకులు దేశాన్ని విభజించారు. ఈ కారణంగా ముస్లిం మెజార్టీ దేశంగా పాకిస్థాన్ ఏర్పడింది. దీని కారణంగా లక్షలాది కుటుంబాలు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో జరిగిన హింసలో లెక్కలెనన్ని ప్రాణాలు పోయాయి. కానీ ఇదే రోజును పాకిస్థాన్ తమ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకుంది. అయితే ప్రధాని మోడీ ఈ సందర్భంగా గతంలో ఒక ట్వీట్ చేశారు. ‘విభజన గాయాలను మేం ఇప్పటికీ మరిచిపోలేదు. వందలాది మంది మా సోదరులు ఈ కారణంగా వలస వెళ్లిపోయారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ప్రజల పోరాటాలు, త్యాగాల గుర్తుకు ఆగస్ట్ 14ను విభజన భయాందోళన సంస్మరణ దినోత్సవంగా జరుపుకుందాం‘ అంటూ పిలుపునిచ్చారు. 1947లో విభజన అనంతరం పాకిస్థాన్ భారత్ కు పక్కలో బల్లెంలా మారింది. నేటికీ కవ్వింపు చర్యలు మానడం లేదు. ఉగ్రవాదులను తయారు చేస్తూ సరిహద్దుల గుండా భారత్ లోకి పంపుతూ దేశంలో అలజడులను సృష్టిస్తున్నది. భారత్ లో హింసకు అనేక ప్రణాళికల రచిస్తున్నది. దీనికి నిదర్శనలే నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక ఘటనలు. ఇక భారత్ వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా, ఒక్కోసారి ఈ ఘటనల కారణంగా ప్రాణ నష్టాలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి.

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం
నాటి అఖండ భారత్ రెండు స్వాతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. పాకిస్థాన్ జాతిపితగా ఆ దేశ మొదటి అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నాగా నాడు కీలక ప్రకటన చేశారు. రేడియో ద్వారా చేసిన ఈ ప్రసంగంలో ఆగస్ట్ 15 పాకిస్థాన్ స్వతంత్ర, సార్వభౌమిక జన్మదినం. ఇది మాతృభూమి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ముస్లిం సోదరుల దేశంగా వర్ధిల్లుతుంది అంటూ స్పష్టం చేశారు. నాడు ఆగస్ట్ 14 అర్ధరాత్రి దేశ విభజన చేశారు.

1947, ఆగస్టు 15న జిన్నా పాకిస్థాన్ గవర్నర్ జనరల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు పాకిస్థాన్ లో తొలి అధికారిక గెజిట్ విడుదలైంది. ఈ సందర్భంగా నాడు జిన్నాతో లాహోర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్ రషీద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక నవాబ్జాదా లియాఖత్ సారథ్యంలో కేబినేట్ కూడా ప్రమాణ స్వీకారం చేసింది.

అయితే, పాకిస్థాన్ మాత్రం ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చినా 14నే వేడుకలు నిర్వహిస్తున్నది. 1948, జూన్ 29న ప్రధాని నవాబ్జాద్ లిఖాయత్ అలీ ఖాన్ సారథ్యంలో నాడు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అయితే దేశ స్వాతంత్ర దినోత్సవం 15న కాదని 14నే నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన గెజిట్ పత్రం నాటి గవర్నర్ జనరల్ జిన్నా ఆమోదం కోసం పంపారు. ఆయన ఆమోదం కూడా తెలిపినట్లుగా ఇస్లామాబాద్ లోని నేషనల్ డాక్యుమెంటేషన్ సెంటర్ లో ఉన్న సమాచార పత్రాల ద్వారా బయటపడింది. ఇక నాటి నుంచి ఆ దేశంలో ఆగస్టు 14నే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఏది ఏమైనా పాకిస్థాన్ దేశంగా ఏర్పడడం భారత్ పెట్టిన భిక్షేనని యావత్ ప్రపంచానికి తెలిసందే.