https://oktelugu.com/

Nani- Ravi Teja: చిరంజీవి రవితేజకు స్ఫూర్తి అయితే, మాకు రవితేజ స్ఫూర్తి – నాని

Nani- Raviteja: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మాలాంటి ఈ తరం నటీనటులకు రవితేజ అన్న స్ఫూర్తి’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 09:20 AM IST
    Follow us on

    Nani- Raviteja: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మాలాంటి ఈ తరం నటీనటులకు రవితేజ అన్న స్ఫూర్తి’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    Nani- Raviteja

    అలాగే నాని ఇంకా ఏమి మాట్లాడాడు అంటే.. ‘నేను ఇక్కడికి గెస్ట్‌గా రాలేదు. రవి అన్న గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. రవితేజ అన్నకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మెగాస్టార్ ఆయనకు స్ఫూర్తి. అలాగే రవి అన్న మాకు స్ఫూర్తి. ప్రతి తరానికి ఒక నటుడు ఉంటాడు. రాబోయే నటీనటులందరికీ, అతనే ప్రేరణగా నిలుస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా చిరంజీవి క్యారవాన్‌లోకి రవి అన్న వచ్చే సీన్ చూశాను.

    Also Read: Pawan Kalyan- Shobhan Babu: పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా?

    నేను కూడా ఏదో ఒక రోజు రవి అన్న కారవాన్‌లోకి అడుగుపెట్టాలని బలంగా ఆశ పడుతున్నాను. నా కోరిక త్వరలోనే జరుగుతుంది. ఇక ఎవరి సినిమా అయినా సరే.. అది రవి అన్నకు నచ్చితే.. ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు. రామారావు ఆన్ డ్యూటీకి సంబంధించిన ట్రైలర్ మరియు ఇతర కంటెంట్ పాజిటివ్ వైబ్‌ని సాధించింది. కాబట్టి సినిమా అద్భుత హిట్ ను సాధిస్తోందని నమ్మకం ఉంది.

    Nani- Raviteja

    మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి రవి అన్న అందించిన సహకారం ప్రశంసనీయం. 20 ఏళ్లుగా ఆయన ఆన్ డ్యూటీలోనే ఉన్నారు. రామారావు ఆన్ డ్యూటీ 29 నుండి.” అని హీరో నాని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా, ఖిలాడీ లాంటి ప్లాప్ సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమా అయినప్పటికీ.. ఈ సినిమా పై ఆ ప్లాప్ ఇమేజ్ పడలేదు.

    ఇక, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో పది కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 57 కోట్లు జరిగింది. కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం 57 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి.

    Also Read:NTR – ANR – Krishna – Sobhan Babu Remuneration: అప్పట్లో ఎన్టీఆర్ – ANR – కృష్ణ – శోభన్ బాబు ఎంత పారితోషికం తీసుకునేవారో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

    Tags