https://oktelugu.com/

Tollywood: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్న నాని, సాయిపల్లవి, కృతి శెట్టి…

Tollywood: టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పిరియాడికల్ స్టోరీ “శ్యామ్ సింగరాయ్”. ఈ డిసెంబర్ 24న భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నాని ఫిల్మ్ మేకర్ గానూ, బెంగాలీ జర్నలిస్ట్ గానూ ద్విపాత్రాభి నయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 06:31 PM IST
    Follow us on

    Tollywood: టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పిరియాడికల్ స్టోరీ “శ్యామ్ సింగరాయ్”. ఈ డిసెంబర్ 24న భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నాని ఫిల్మ్ మేకర్ గానూ, బెంగాలీ జర్నలిస్ట్ గానూ ద్విపాత్రాభి నయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ ఈ సినిమాపై ఇంకాస్త ఊహాగానాలను పెంచేలా చేసింది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను వైభవంగా జరిపారు. ప్రస్తుతం ఈ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది.

    అయితే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 లో 16 వేల కోట్ల మొక్కలు నాటిన యం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా “శ్యామ్ సింగరాయ్” సినిమా టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంపీ సంతోష్ కుమార్ ఛాలెంజ్ ను స్వీకరించిన శ్యామ్ సింగరాయ్ మూవీ నటీనటులైన నాని, సాయిపల్లవి, కృతి శెట్టి మొక్కలు నాటారు. ఒకొక్కరు 3 మొక్కలు చొప్పున నాటి ఈ చైన్ ను కంటిన్యూ చేయాలని తన ఫ్యాన్స్‌ను ఈ కార్యక్రమానికి నామినేట్ చేశారు. కాగా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 24 వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది.