Shyam Singaroy: తనదైన సహజ నటనతో అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. విభిన్న పాత్రలు, విభిన్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం నాని ” శ్యామ్ సింగ రాయ్ ” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి “టాక్సీవాలా” దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం చేస్తున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పిరియడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంఈ చిత్రం తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఇక మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మూవీ మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ పాటల్లో సిరివెన్నెల చివరి పాట విశేష స్పందన దక్కించుకుంది. అద్భుతమైన సాహిత్యంతో మరోసారి ఆకట్టుకున్నారు సిరివెన్నెల. ఈ క్రమంలోనే శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈ ఈవెంట్‌ను డిసెంబర్ 14 న గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
#ShyamSinghaRoy 🔱 to STEP on the LAND of Revolutions ✊#SSRRoyalEvent 🤩🔥will be held at Warangal on DEC 14th from 5 PM Onwards ✨
Natural🌟@NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @vboyanapalli @Rahul_Sankrityn @MickeyJMeyer @NiharikaEnt#SSRonDEC24th💥 pic.twitter.com/D9oDN0gbrn
— Niharika Entertainment (@NiharikaEnt) December 10, 2021