Nani on Jersey 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనుకునే నటీనటులు చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రం ఇక్కడ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంతమంది మాత్రం సినిమాలు లేక, అవకాశాలు రాక ఢీలా పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి వాళ్లలో చాలామంది వాళ్లకు వాళ్లు ఏదో ఒకటి చేసి తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరి చూపు చాలా హై లెవెల్లో ఉంటుంది. ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందిన వారికి మాత్రమే మంచి గుర్తింపు వస్తుంది. ఇక అలాంటి క్రమంలోనే చాలామంది నటీనటులు తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో మంచి సినిమాలు, క్వాలిటీ ఉన్న కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాని లాంటి హీరో అయితే ఈ కోవకు చెందిన హీరో అనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే తనదైన రీతిలో సినిమాలను చేయడం ప్రతి సినిమాలోను ఏదో ఒక వైవిధ్యాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు.
అందుకోసమే ఒక సినిమా చేయడానికి ఆయన చాలా ఆరాటపడుతూ ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఇక సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని ప్రస్తుతం తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని జెర్సీ 2 సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇక నాని మాట్లాడుతున్నప్పుడు తన అభిమానులు అందరూ జెర్సీ 2 సినిమా తీసేది ఎప్పుడు అని అడుగుతుంటే నాని నవ్వుతూ ‘జెర్సీ 2 లో నేను ఉండను గా వాళ్ళు ఎప్పుడైనా చేసుకోనివ్వండి, ఎవరితోనైనా చేసుకోనివ్వండి’ అని సమాధానం చెప్పాడు. జెర్సీ మొదటి పార్ట్ లో చివర్లో నాని చనిపోతాడు. ఇక తన కొడుకు పాత్రను హరీష్ కళ్యాణ్ చేశాడు. మరి ఆయనతో జెర్సీ 2 సినిమా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…