https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం ‘ కి నష్టాలు తప్పవా..? దానికి కారణం ఏంటంటే..?

ఒకసారి ఒక సినిమా తీశాము అంటే అది పక్క గా సక్సెస్ సాధించాలి. లేదంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నష్టాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి దర్శకులు ఒక సినిమా తీసేటపుడే ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది కూడా చూసుకోవాలి...

Written By:
  • Gopi
  • , Updated On : September 10, 2024 / 10:29 AM IST

    Saripodhaa Sanivaaram

    Follow us on

    Saripodhaa Sanivaaram: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యంగ్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల్లో నాని కి చాలా మంచి క్రేజ్ ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. దసరా సినిమాతో 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఈ హీరో ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరోసారి భారీ కలెక్షన్లు రాబట్టే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద మొదట్లో కొంచెం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు 100 కోట్లకు పైన కలెక్షన్లు వచ్చాయి అంటూ భారీ ప్రచారం అయితే జరుగుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో నాని తన నట విశ్వరూపాన్ని చూపించి ఎస్ జే సూర్యతో తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా అతనితోపాటు పోటీపడి నటించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి నాని అలవోకగా పోటీపడి మరి నటించి నటనలో కూడా పరిణితిని కనబరిచాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాని ఒక మంచి సక్సెస్ ని అందుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికైతే ఈ సినిమాకి లాంగ్ రన్ లో భారీగా నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

    ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని సినిమా యూనిట్ వారు ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు తప్ప ఒరిజినల్ కలెక్షన్స్ అయితే అవి కావు అంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం… నిజానికి ఈ సినిమాతో కనక నాని భారీ సక్సెస్ ని అందుకుంటే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న వాడు అవుతాడని ప్రేక్షకులు అందరూ భావించారు.

    కానీ దానికి భిన్నంగా ఈ సినిమా రిజల్ట్ అనేది మారబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ మరికొన్ని ఏరియాలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు అంతా సెక్యూరు గా ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు.

    మరి ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లైతే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉండటం అలాగే ఓవర్ బడ్జెట్ లాంటి వాటి వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరి కొంతమంది సమాధానం అయితే చెబుతున్నారు. ఇక నాని మార్కెట్ కు మించి ఇందులో బడ్జెట్ పెట్టడమే దానికి కారణం అని కూడా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమా ఫైనల్ గా ప్రొడ్యూసర్ గా లాభాలు తీసుకువస్తుందా? లేదంటే నష్టాలను మిగులుస్తుందా? అనేది…