Nani Paradise Movie Character: తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు నాని…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో సైతం తను డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. చెవులకు రింగులు పెట్టుకున్నాడు, ముక్కుకు ముక్కుపుడక పెట్టుకొని జడలు వేసుకుని కనిపిస్తున్నాడు. ఇక ఇందులో ఆయన ఏ పాత్రను పోషిస్తున్నాడు. అమ్మాయిగా కనిపిస్తున్నాడా? లేదంటే అబ్బాయిగా కనిపిస్తున్నాడా? ఈ రెండు కాకుండా ట్రాన్స్ జెండర్ గా కనిపించి ప్రేక్షకులను మ్యాజిక్ చేయబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ విషయం మీద రీసెంట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించినట్లు తెలుస్తోంది. నాని ఈ సినిమాలో ట్రాన్స్ జండర్ గా కనిపించబోతున్నాడు అంటూ ఒక హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది… ఇక తన సన్నిహిత వర్గాల దగ్గర నుంచి ఇదే వార్త బయటకి వస్తుండడంతో నాని ఈ క్యారెక్టర్ లో ఎలా మెప్పిస్తాడు.
ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి పాత్రని ఎవరు చేయలేదు. మరి నాని ఈ సినిమా ఆ పాత్రను ఏ విధంగా చేసి మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఏది ఏమైనా కూడా ప్రస్తుతం నాని తన రూట్ మార్చుకొని మొత్తం మాస్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. కెరీర్ మొదట్లో సేఫ్ జోన్ లోకి వెళ్లిన నాని ఇప్పుడు మాత్రం ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాడు…
ఇక ఇప్పటినుంచి నాని పూర్తిగా మాస్ సినిమాలను చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు నాని బర్త్ డే సందర్భంగా నాని సుజీత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు…