Nani: బలగం వేణు తో నాని కొత్త సినిమా… ఈ సినిమా చేయడం వల్ల రిస్క్ లో పడుతున్న నాని…

నిజానికి వేణు తీసిన బలగం సినిమా నిజ జీవితపు బంధుత్వాల నేపథ్యంలో ఉండటం, అది కూడా తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని బంధుత్వాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విధంగా ఒక మంచి మెసేజ్ నిచ్చే సినిమాగా తెరకెక్కించాడు.

Written By: Raj Shekar, Updated On : December 5, 2023 2:20 pm

Nani

Follow us on

Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో నాని ఒకరు. ఈయన వైవిధ్యమైన కథంశాలను ఎన్నుకుంటూ వరుసగా సక్సెస్ లు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఈ క్రమం లోనే డిసెంబర్ 7వ తేదీన ఆయన చేసిన హాయ్ నాన్న అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది ఇక ఆ సినిమాతో తన ఖాతాలోకి మరో సక్సెస్ వస్తుంది అంటు సినిమా యూనిట్ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బలగం సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన వేణు డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం అయితే తెలుస్తుంది.

ఈ విషయం మీద ఎక్స్ ట్విట్టర్ లో ఒక అభిమాని మీ నెక్స్ట్ సినిమా ఎంటి అని అడిగగా దానికి స్పందిస్తూ బలగం వేణు తో మూవీ అని చెప్పారు. ఇక ఈ సినిమా మీద ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలుగుతుంది. కొందరు వేణు తో నాని సినిమా కమిట్ అయి మంచి పని చేశాడు ఎందుకంటే నానికి కూడా వేణు ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాని ఇస్తాడు అంటూ కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం నాని వేణు తో సినిమా చేయడం కరెక్ట్ కాదేమో ఉన్నట్టుగా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు…

నిజానికి వేణు తీసిన బలగం సినిమా నిజ జీవితపు బంధుత్వాల నేపథ్యంలో ఉండటం, అది కూడా తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని బంధుత్వాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విధంగా ఒక మంచి మెసేజ్ నిచ్చే సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం తోపాటు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయినప్పటికీ ఈ సినిమాలో హీరో హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇది ఓన్లీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన మూవీ కాబట్టి అలా నడిచింది ఇప్పుడు నానితో వేణు సినిమా చేయాలి అంటే మంచి కథ ఉండాలి దానికి తగ్గట్టుగానే హీరోకి ఉండే ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. అలాంటి కథ తో వేణు ముందుకొస్తే తప్ప మంచి సక్సెస్ ని అందుకోలేడు ఇక ఇలాంటి సమయంలో నాని వేణు కి అవకాశం ఇచ్చి తప్పు పని చేస్తున్నాడా అంటూ కొంతమంది నాని అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే వేణుకి నాని ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉందా అనేది కూడా ఆలోచించాల్సి ఉంది…తనకి ఈ సినిమా కనక తేడా కొట్టినటైతే ఇప్పటి వరకు నాని సంపాదించుకుంటూ వచ్చిన క్రేజ్ మొత్తం పోతుంది అంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు…