Tamil Nadu: రాష్ట్ర పోలీసులు, కేంద్ర దళాల మధ్య ఘర్షణ వాతావరణం

ఈ సందర్భంగా 3 కోట్లు ఇవ్వాలని ఈడీ అధికారి అడిగితే దుండిగల్ ప్రభుత్వ డాక్టర్ 20 లక్షలు ఇచ్చాడట.. మరో 20 లక్షలు మరో కొద్దిరోజులకు ఇస్తుండగా డీఎంకే ప్రభుత్వం సీఐడీ పట్టుకొని జైలుకు పంపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు, కేంద్ర దళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Written By: NARESH, Updated On : December 5, 2023 2:44 pm

అవినీతి ఎవరు చేసినా తప్పే.. అవినీతి చేసే వాళ్లను పట్టుకునే వాళ్లే చేస్తే ఇంకా నేరం. వారికి శిక్ష ఇంకా ఎక్కువ ఉండాలి. అదే ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది. దాని వెనుక ఎన్నో ఉన్నాయి. ఈడీ మనీలాండరింగ్ లో వ్యవహారాలను బయటపెట్టే దర్యాప్తు సంస్థ. వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో పట్టుబడడంలో దాని సేవలు అమోఘం.

తమిళనాడులో 11 మంది మంత్రులు అవినీతిలో కూరుకుపోయారు. దాన్ని ఐటీ, ఈడీ బయటపెడుతున్నాయి. దీంతో డీఎంకే నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సెంథిల్ బాలాజీ, పెనుమూడి, దురై మురుగై లాంటి మంత్రులు అవినీతి చేసినట్టు ఈడీ నిగ్గు తేల్చింది.

ఈడీపై డీఎంకే ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. ఈడీ అధికారులను వేటాడని స్టాలిన్ సర్కార్ రెడీ అయ్యింది. మధురై లోని ఈడీ ఆఫీసులో అంకిత్ తివారీ అనే ఉత్తరాది ఈడీ అధికారిని టార్గెట్ చేసింది. అక్టోబర్ 9న దుండిగల్ ప్రభుత్వ డాక్టర్ కు ఫోన్ చేసి విజిలెన్స్ కేసుపై దర్యాప్తు చేయాలని.. పీఎంవో ఆఫీసు నుంచి కాల్ వచ్చిందని కలువాలని కోరారు.

ఈ సందర్భంగా 3 కోట్లు ఇవ్వాలని ఈడీ అధికారి అడిగితే దుండిగల్ ప్రభుత్వ డాక్టర్ 20 లక్షలు ఇచ్చాడట.. మరో 20 లక్షలు మరో కొద్దిరోజులకు ఇస్తుండగా డీఎంకే ప్రభుత్వం సీఐడీ పట్టుకొని జైలుకు పంపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు, కేంద్ర దళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

తమిళనాడు, కేంద్రం మధ్య వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.