Nani: మరో 5 రోజుల్లో విడుదల అవ్వబోయే ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం కోసం నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. హీరోగా హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాని, ఈమధ్యనే కోర్ట్ చిత్రం తో నిర్మాతగా మారి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా, హీరో గా మొట్టమొదటిసారి ఒకే సినిమా కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ని రాబట్టే సినిమాగా నిల్చిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. విడుదల తర్వాత ఈ సినిమా రేంజ్ ఏమిటో తెలుస్తుంది. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
Also Read: రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా లతో సహా 143 మంది సినీ సెలబ్రిటీలు ఉన్న గ్రూప్ లో నేను కూడా ఉండేవాడని. కానీ నేను గ్రూప్స్ ని పెద్దగా చూడను కాబట్టి, దానిని మ్యూట్ లో పెట్టాను. ఒకరోజు మంచు లక్ష్మి ఒక సరదా సంఘటనకు సంబంధించిన చాట్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా లో పెట్టేలోపు షాక్ కి గురయ్యాను. అయితే ప్రస్తుతం ఈ గ్రూప్ ఒకప్పుడు ఉన్నంత యాక్టీవ్ గా ఇప్పుడు లేదు అనుకుంటున్నాను. ఒకవేళ యాక్టీవ్ గా ఉన్నా ఉండొచ్చు. ఈ గ్రూప్ ని క్రియేట్ చేసిన కొత్తల్లో చాలా యాక్టీవ్ గా ఉండేది. ఇప్పుడు చాలామంది నటీనటులు ఫోన్ నంబర్స్ మార్చడం వల్ల, ఒకప్పుడు ఉన్నంత యాక్టీవ్ గా ఇప్పుడు ఆ గ్రూప్ ఉండే పరిస్థితులు లేవు’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘మేమంతా సరదాగా అందరి స్నేహితులం లాగానే జోక్స్ వేసుకోవడానికి, సరదా కామెంట్స్ చేసుకోవడానికే ఆ గ్రూప్ పెట్టుకున్నాము. మా సినిమాలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ విడుదలైన మాట్లాడుకునేవాళ్ళం. అందరితో టచ్ లో ఎల్లప్పుడూ ఉండేందుకు కోసమే ఆ గ్రూప్ క్రియేట్ చేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Also Read: ఎన్టీఆర్ కోసం హెలికాప్టర్ నుండి వార్ ట్యాంకర్లు తెప్పించిన ప్రశాంత్ నీల్..!