Nani: నాని గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న మంచి విజయాలు అందుకున్నాయి. దసరా నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నాని డీగ్లామర్ రోల్ లో అదరగొట్టాడు. ఇక హాయ్ నాన్న మూవీలో లవర్ బాయ్ గా, ఫాదర్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన హిట్ 3 చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడాను. దర్శకుడు శైలేష్ కొలను హిట్ చిత్రాన్ని విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కించాడు. హిట్ మూవీ సక్సెస్ కావడంతో.. హిట్ 2 చిత్రాన్ని అడివి శేష్ తో చేశారు.
హిట్ 2 సైతం పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు అందుకుంది. హిట్, హిట్ 2 చిత్రాలను నిర్మించిన నాని.. హిట్ 3లో స్వయంగా నటిస్తున్నాడు. అలాగే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ది పారడైజ్ అనే మూవీ చేస్తున్నారు. హిట్ కాంబో కావడంతో అంచనాలు పెరిగాయి. కాగా నాని మరో చిత్రానికి సైన్ అనేది లేటెస్ట్ న్యూస్.
సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తో మూవీకి నాని సైన్ చేశాడట. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ములతో నాని మూవీ చేయలేదు. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. నాని ఇమేజ్, నటనా శైలి.. శేఖర్ కమ్ముల సబ్జెక్టులకు బాగా సూట్ అవుతుందనే భావన చాలా మందిలో ఉంది. ఎట్టకేలకు నాని-శేఖర్ కమ్ముల కాంబో సెట్ అయ్యిందనే సమాచారం బయటకు వచ్చింది.
ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర మూవీ చేస్తున్నారు. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఓ భిన్నమైన సబ్జెక్ట్ తో కుబేర తెరకెక్కుతుంది. కుబేర టీజర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. కుబేర విడుదల అనంతరం నాని మూవీ పనులు శేఖర్ కమ్ముల ప్రారంభించవచ్చు.
ఆల్రెడీ నాని రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న తరుణంలో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు కాస్త సమయం పట్టొచ్చు. శేఖర్ కమ్ముల చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తారు.