https://oktelugu.com/

Natural Star Nani : హిట్ 3′ క్లైమాక్స్ లో ఊర మాస్ హీరో ఎంట్రీ..’హిట్ 4′ హీరో కూడా అతనే..నిర్మాతగా నాని జాక్పాట్ కొట్టినట్టే!

'హిట్ 2' కి కొనసాగింపుగా 'హిట్ : ది థర్డ్ కేస్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయనే హీరో కూడా. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By: , Updated On : January 28, 2025 / 07:26 PM IST
Natural Star Nani

Natural Star Nani

Follow us on

Natural Star Nani :  న్యాచురల్ స్టార్ నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే ప్రొడక్షన్ హౌసేకి స్థాపించి ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ‘హిట్ : ది సెకండ్ కేస్’ కూడా పెద్ద హిట్ అయ్యింది. అడవి శేష్ హీరో గా నటించిన ఈ చిత్రం క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ గా కనిపించి ఫ్యాన్స్ ని థ్రిల్ కి గురయ్యేలా చేసాడు నాని. ఇప్పుడు ‘హిట్ 2’ కి కొనసాగింపుగా ‘హిట్ : ది థర్డ్ కేస్ ‘ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయనే హీరో కూడా. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి మరో లుక్ ని విడుదల చేసారు. నాని స్టైల్ గా గన్ తలకి పెట్టుకొని జాతీయ జెండా కి సెల్యూట్ చేస్తున్నట్టు పెట్టిన ఈ స్టిల్ సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. దీనిపై అనేక మంది ట్రోల్స్ కూడా బీభత్సంగా చేస్తున్నారు. ఒక హీరోకి ఎక్కువ ట్రోల్స్ వచ్చాయంటే, ఆ హీరో స్టార్ రేంజ్ కి ఎదిగినట్టు అర్థం.. నాని కూడా ఆ రేంజ్ కి ఎదిగాడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే హిట్ 2 క్లైమాక్స్ లో నాని అతిథి పాత్రలో కనిపించినట్టుగా, హిట్ 3 క్లైమాక్స్ లో నందమూరి బాలకృష్ణ కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట.’హిట్ 4 ‘ లో ఆయనే హీరో గా నటించబోతున్నాడు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని, ఇప్పుడు బాలయ్య తో కూడా సినిమా తీస్తుండడం ఆసక్తిని రేపుతున్న అంశం. జీరో నుండి మొదలై ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాగా నిల్చిన చిరంజీవి, బాలయ్య లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసే రేంజ్ కి నాని ఎదిగిన తీరుని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. టాలెంట్, అదృష్టం, పైకి ఎదగాలి అనే కసి ఉంటే ఒక మనిషి ఏ రంగం లో అయిన సక్సెస్ అవ్వగలరు అనడానికి నిదర్శనం నాని అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ సిరీస్ లో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద స్టార్స్ కూడా చేరుతారట. ఈ సిరీస్ లోని చివరి సినిమా లో ఇప్పటి వరకు హిట్ సిరీస్ లో నటించిన హీరోలందరూ కనిపిస్తారని టాక్.