Block Buster Pongal Song
Sankrathiki Vastunnam : డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), హీరో వెంకటేష్ (Venkatesh) కాంబోలో పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం (Sankrathiki vastunnam) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా ఆల్ టైం రికార్డు కలెక్షన్లను (Collections) రాబట్టింది. సినిమాలో పెద్దగా స్టోరీ లేకపోయినా కామెడీ బాగుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఎంటర్‌టైన్ అయ్యారు. జనవరి 14వ తేదీన వచ్చిన ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ టికెట్లు సరిగ్గా దొరకడంలేదు. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్ అనే పాట పాడిన విషయం తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ కావడంతో పాటు బాగా వైరల్ అయ్యింది. పొంగల్ సెట్‌లో మంచి కలర్ ఫుల్‌గా ఉందని ఈ పాట ప్రొమో చూసే అందరూ కామెంట్ల వర్షం కురిపించారు. వెంకీ మామ పాటతో అదరగొట్టాడని చాలా మంది అన్నారు. అయితే తాజాగా బ్లాక్ బస్టర్ పొంగల్ ఫుల్ వీడియో సాంగ్ (Video Song) యూట్యూబ్ లోకి వచ్చేసింది. దీంతో నెటిజన్లు వెంకీ మామ పాట అదరగొట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు. వెంకీ మామ చిన్న స్టెప్స్ వేసిన కూడా ఫవర్ ఫుల్‌గా వేశాడని అంటున్నారు. చాలా ఎనర్జీటిక్‌గా పాడటంతో పాటు డ్యాన్స్ మూవ్స్ చించేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వెంకీ మామ పాట, డ్యాన్స్‌తో పాటు సెట్ అదిరిపోయిందని.. మంచి కలర్ ఫుల్‌లో ఉందని అంటున్నారు. ఈ పాటకు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. వెంకటేశ్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ ఈ పాట పాడారు. సంక్రాంతి పండుగ, పల్లెటూరి నేపథ్యంలో రామజోగయ్య శాస్తి ఈ పాటకు లిరిక్స్ రాశారు.
ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ పాట మాత్రమే కాకుండా మిగతా పాటలు కూడా హిట్ అయ్యాయి. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత రమణ గోగుల, మధుప్రియ గోదారి గట్టు మీద సాంగ్ పాడారు. ఈ పాట అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చిన మీనూ పాట కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. సంక్రాంతి పోటీగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. సినిమా విడుదలైన13 రోజుల్లోనే 270 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మొత్తం 200 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది. ఏడు రోజులలో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొదటి రీజనల్ తెలుగు సినిమాగా వెంకీ మామ రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం తెలుగు భాషలో మాత్రమే సినిమా రిలీజ్ చేశారు. అయినా కూడా అన్ని సినిమాలను దాటి రికార్డులు సృష్టించింది. అయితే ఈ రికార్డు గతంలో అలా వైకుంఠపురం సినిమా పేరు మీద ఉండేది. కానీ సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసింది. కామెడీ జోనర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది