https://oktelugu.com/

Thandel Trailer Review : ప్రేమ, దేశభక్తి కి అద్దంపట్టిన ‘తండేల్’ ట్రైలర్..వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మరో కలెక్షన్ల సునామీ గ్యారంటీ!

డేల్ అనే పదానికి కూడా అర్ధాన్ని చెప్తూ ఒక డైలాగ్ అయితే వచ్చింది. తండేల్ అంటే నాయకుడు అనే అర్థం వస్తుంది. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లను కూడా బతికిస్తూ ముందుకు తీసుకెళ్లే వాడే నాయకుడు

Written By:
  • Gopi
  • , Updated On : January 28, 2025 / 07:36 PM IST
    Follow us on

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ (Thandel) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్, బన్నీ వాసు ఇద్దరు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు… ఇక ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంలో కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే సాయి పల్లవి, నాగచైతన్యల మధ్య లవ్ స్టోరీ ని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ అయితే ఈ సినిమాను తీసినట్టుగా తెలుస్తోంది…

    ట్రైలర్ లో దాన్ని భారీ గా ఎలివెట్ చేశారు…ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. ఆ ప్రేమ ఎలా పెళ్ళిగా మారబోతుంది అనేదాన్ని స్ట్రాంగ్ పాయింట్ గా తీసుకొని ఈ సినిమాని చిత్రీకరించారు. ఇక అదే విషయాన్ని ఈ ట్రైలర్ లో కూడా ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలోనే నాగ చైతన్య వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు.

    అక్కడి నుంచి ఆయన ఎలా బయటపడి ఇంటికి తిరిగి వచ్చాడు అనేదే సినిమా కథ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. అయితే విజువల్స్ పరంగా చూసుకున్నప్పటికి సినిమాని చాలా రిచ్ గా తీసినట్టుగా అయితే మనకు ట్రైలర్ లో చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది…ఇక ఈ సినిమాలో దేశభక్తిని హైలెట్ చేసి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఎందుకంటే ట్రైలర్ చివర్లో వందేమాతర గీతం కూడా వచ్చింది. అలాగే నాగచైతన్య చెప్పిన ‘మా దేశం లో ఉన్న ఉర కుక్కలన్ని ఉచ్చ పోస్తే ప్రపంచ పటం లో పాకిస్థాన్ అనే దేశం లేకుండా పోతుంది’ అనే డైలాగ్ అయితే ట్రైల్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది… అయితే ఇంకా కొంచెం దేశ భక్తి సన్నివేశాలను ఎక్కువగా ట్రైలర్ పెడితే బాగుండేది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం చాలా రిచ్ విజువల్స్ తో తెరకెక్కించారు. అలాగే మధ్య మధ్యలో డైలాగులు కూడా సినిమా మీద హైప్ ను పెంచుతుంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీ రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    అలాగే తండేల్ అనే పదానికి కూడా అర్ధాన్ని చెప్తూ ఒక డైలాగ్ అయితే వచ్చింది. తండేల్ అంటే నాయకుడు అనే అర్థం వస్తుంది. మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్లను కూడా బతికిస్తూ ముందుకు తీసుకెళ్లే వాడే నాయకుడు…ఇక అదే మాటకి స్టిక్ అయిన రాజు అనే వ్యక్తి తనతోపాటు ఉన్న తన స్నేహితులను కూడా పాకిస్థాన్ భారీ నుంచి ఎలా కాపాడాడు అనే పాయింట్ని చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసి చెప్పినట్టుగా అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ అయితే బాగుంది… మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది…