Nani Comments About Rajamouli: జీ తెలుగు ఛానల్ లో ఇటీవలే మొదలైన జగపతి బాబు(Jagapathi Babu) అన్ ఫిల్టెర్డ్ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. మొదటి రెండు ఎపిసోడ్స్ ని చూసిన ఆడియన్స్ ఇది బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో కంటే గొప్పగా ఉందని, జగపతి బాబు హోస్టింగ్ ఇంత బాగుంటుందని ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మూడవ ఎపిసోడ్ కి నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ని ముఖ్య అతిథిగా పిలిచారు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్లిద్దరి మధ్య జరిగిన చిట్ చాట్ మొత్తం ఎలాంటి ఎమోషనల్ మూమెంట్స్ లేకుండా చాలా ఫన్ గా సాగిపోయింది. నాని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన అసలు పేరు నవీన్ బాబు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అవన్నీ ఈ ఎపిసోడ్ ద్వారానే తెలిసాయి.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
జగపతి బాబు ఒక ప్రశ్న అడుగుతూ ఏ డైరెక్టర్ కి నువ్వు కళ్ళు మూసుకొని బ్లైండ్ గా కథ వినకుండా ఓకే చెప్పేస్తావు అని అడగ్గా దానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా టక్కుమని రాజమౌళి పేరు చెప్తాడు నాని. గతం లో రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఈగ’ చిత్రం లో నాని హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ కాదు, కేవలం సినిమాలో 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు, ఆ తర్వాత చనిపోయి ఈగ రూపం లో పునర్జన్మ ఎత్తి విలన్ పై పగ తీర్చుకుంటాడు. నాని అప్పట్లో చిన్న హీరో కాబట్టి చిన్న క్యారక్టర్ అయినా ఒప్పుకొని చేసాడు. కానీ ఇప్పుడు ఆయన ఎంత పెద్ద రేంజ్ కి వచ్చాడో మనమంతా చూస్తూనే. ఇంత పెద్ద రేంజ్ కి వచ్చినా సరే రాజమౌళి అడిగితే స్టోరీ ఏంటి?, క్యారక్టర్ అనేది ఏంటి అనేది కూడా చూడను, వెంటనే ఓకే చెప్పేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ ఇంటర్వ్యూ లో. ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలు అనుకుంటే వెంటనే ఈ ఇంటర్వ్యూ ని జీ 5 యాప్ లో చూసేయండి.