Nani The Paradise First Look: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) చేస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో ‘ది ప్యారడైజ్'(The Paradise) చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న గ్లింప్స్ వీడియో తో స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఎలాంటి క్రేజ్ వస్తుందో అలాంటి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని సబ్జెక్టు ని మనకి చూపించబోతున్నారు అనేది నేటి తరం యంగ్ జనరేషన్ ఆడియన్స్ కి స్పష్టంగా అర్థమైపోయింది. ఈమధ్య కాలం లో స్టార్ పవర్ ఉన్న సినిమాలకంటే ఇలాంటి సినిమాలకే ఎక్కువగా జనాలు ఆకర్షితులు అవుతున్నారు. అలా గ్లింప్స్ వీడియో తోనే సంచలనం రేపిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. గ్లింప్స్ వీడియో లో నాని లుక్ ని పెద్దగా చూపించలేదు. జడలు వేసుకున్నట్టు చిన్న లుక్ బయటకి వదిలారు కానీ, అది స్పష్టంగా లేదు.
Also Read: న్యాయ పోరాటానికి సిద్దమైన ధనుష్ దర్శకుడు..వివాదం తారాస్థాయికి చేరిందిగా!
అందుకే నేడు ఆయన క్యారక్టర్ పేరు ని బయటపెడుతూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమాలో ఆయన పేరు ‘జడల్’ అట. ఫస్ట్ లుక్ లో కూడా నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, జడలు ముందుకు వేసుకొని చాలా స్టైల్ గా కనిపించాడు నాని. ఫస్ట్ లుక్ లో చూస్తుంటే జడలు కనిపిస్తున్నాయి, కానీ క్యారక్టర్ పేరు కూడా జడలు అని పెడతారని ఊహించలేకపోయారు ఆడియన్స్. ఇక గ్లింప్స్ లో వాడిన బూతుల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది చాలా అతిశయం అనిపించింది కానీ, అత్యధిక శాతం యూత్ ఆడియన్స్ కి మాత్రం నచ్చింది. నాని కెరీర్ ఏ స్థాయికి వెళ్లబోతుంది అనేది ఈ సినిమాతో ఖరారు అవుతుంది. హిట్ అయితే స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడతాడు. ఒకవేళ ఫ్లాప్ అయితే నాని పాతాళంలోకి పడిపోతాడు.
Also Read: ఓజీ ‘ఫైర్ స్ట్రోమ్’ పాటలో కనిపించిన ఈమె ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు!
ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్ ని రిస్క్ లో పెట్టి తీస్తున్నదే అనుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి నాని నే నిర్మాత అనే విషయం మన అందరికీ తెలిసిందే. అనుకున్న తేదికి చిత్రాన్ని తీసుకొని రావాలి అనే ఉద్దేశ్యంతో మేకర్స్ అందుకు తగ్గట్టుగా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలైన పక్క రోజునే రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది, కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రం వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి.
Presenting to you all – 'Jadal'.
This time, my hero, @NameisNani anna ❤️ will walk into hell and turn it into #TheParadise
March 26th, 2026 in Cinemas Worldwide. pic.twitter.com/LNtUz9hOkH
— Srikanth Odela (@odela_srikanth) August 8, 2025