
Natural Star Nani: స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఏవరేజ్ గా 35 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంది. మరి ఏడాదికి ఒక్కో స్టార్ హీరో నుంచి వచ్చేది ఒక్క సినిమా మాత్రమే. కాబట్టి అంత పెద్ద మొత్తంలో తీసుకోకపోతే ఏ మాత్రం గిట్టుబాటు కాదు, మన హీరోలు కూడా ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే, సినిమాల ఎంపిక లేటు అయింది. ఈ క్రమంలో పెద్ద హీరోలు ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తే గొప్ప అన్నట్లుగా తయారు అయింది ప్రస్తుత పరిస్థితి.
సరే.. టాప్ స్టార్స్ కాబట్టి.. వాళ్ళ లెక్కలు వాళ్లకు ఉంటాయి అనుకోవచ్చు. కానీ, మిడిల్ రేంజు హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉదాహరణకు విజయ్ దేవరకొండను తీసుకుందాం. విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ కాదు. ఏవరేజ్ హీరోనే. సోషల్ మీడియా పుణ్యమా అని అతనొక సూపర్ స్టార్ లా చలామణి అవ్వాల్సిన పరిస్థితి కలిగింది.
దాంతో విజయ్ దేవరకొండ పై కూడా ఒత్తిడి పెరిగింది. వేగంగా సినిమాలు చేయడానికి భయపడుతున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు ప్లాప్ లు పడ్డాయి. ఇప్పుడు చేస్తోన్న లైగర్ కూడా ప్లాప్ అయితే, ఇక విజయ్ కూడా ఏవరేజ్ రేంజ్ కంటే తక్కువకు పడిపోతాడు. అసలుకే విజయ్ దేవరకొండ నుంచి గత 20 నెలల్లో ఒక్క సినిమా కూడా రాలేదు.
ఏది ఏమైనా ఇప్పుడు ఫామ్ లో ఉన్న హీరోల్లో నానినే తెలివిగలవాడు. నాని ఒక్కో సినిమాకి దాదాపు 14 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వేగంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందుకే, ఈ కరోనా టైంలో కూడా తన నుంచి రెండు సినిమాలను రిలీజ్ చేయగలిగాడు.
మరో రెండు సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఈ డిసెంబర్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాని థియేటర్లోకి తెస్తున్నాడు. మొత్తానికి నాని ఏడాదికి మూడు సినిమాలు చొప్పున చేస్తూ వస్తున్నాడు. ఈ లెక్కన నాని సంపాదన ఏడాదికి 42 కోట్లు. వచ్చే ఏడాది ‘అంటే సుందరానికి’, ‘దసరా’ అనే సినిమాలను రెడీ చేస్తున్నాడు. మొత్తమ్మీద స్టార్ హీరోల సంపాదనకు నాని సంపాదన ఏ మాత్రం తీసిపోదు. పైగా ఎక్కువే సంపాదిస్తున్నాడు కూడా.