Nani Bloody Romeo Movie Update: ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ సుజిత్ నేచురల్ స్టార్ నాని తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని కూడా విడుదల చేశారు. దానికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి లెక్క ప్రకారం ఈపాటికి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిపోవాలి. కానీ నాని ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల , ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గత కొంత కాలం నుండి సుజిత్ ప్రస్తుతానికి ‘బ్లడీ రోమియో’ మూవీ ని పక్కన పెట్టాడని, ‘ఓజీ 2’ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని మొదలుపెట్టాడని, ముందుగా ఈ సినిమానే మొదలు అవ్వబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి తగ్గట్టుగానే , నిన్న పవన్ కళ్యాణ్ టీం ‘ఓజీ 2’ రెడీ అవుతోందని, సుజిత్ విదేశాల నుండి తిరిగి రాగానే షూటింగ్ షెడ్యూల్స్ కి సంబంధించిన చర్చ ఉంటుందని చెప్తూ ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి , పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది. కొంతమంది అయితే సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే , ‘ఓజీ 2’ మూవీ షూటింగ్ నే మొదలు పెట్టబోతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. మరి బ్లడీ రోమియో పరిస్థితి ఏంటి?, ‘ది ప్యారడైజ్’ మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది. కాబట్టి ఇప్పట్లో నాని అందుబాటులో లేడు కాబట్టి , ముందుగా ఓజీ సిరీస్ ని పూర్తి చేస్తే బాగుండును అనే ఆలోచన లో కూడా సుజిత్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి , పవన్ కళ్యాణ్ లుక్స్ ఇప్పుడు ఇంత యంగ్ గా తయారు అవ్వడానికి కారణం ‘ఓజీ 2’ లుక్స్ అయ్యిందొచ్చని అంటున్నారు.
అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టీ చూస్తే , సుజిత్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడట. అక్కడ ‘బ్లడీ రోమియో’ మూవీ కోసం ఆయన కొన్ని లొకేషన్స్ ని రెక్కీ చేసాడట. అంతే కాకుండా ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్న మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ డేట్స్ కూడా ఖాలీగా లేవట. ఒక్కసారి ఆయన డేట్స్ అందుబాటులోకి రాగానే , ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని , దాదాపుగా 90 రోజులపాటు షూటింగ్ సాగే ‘బ్లడీ రోమియో’ పూర్తి అయ్యాకనే సుజిత్ ‘ఓజీ 2’ వైపు అడుగులు వేస్తాడని తెలుస్తోంది. వీటిల్లో ఏది నిజం అనేది తెలియాలంటే సుజిత్ ఇండియా వచ్చే వరకు ఆగాల్సిందే.

