Varanasi: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియకుండా జరిగిపోతున్నాయి. కారణం ఏంటి అంటే చాలామంది దర్శకులు సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటుంటే సోషల్ మీడియాలో మాత్రం మరి కొంతమంది ఏఐ వీడియోలు క్రియేట్ చేసుకుంటూ నిజమా అబద్దమా ఓ డైలామా లో జనాలు ఉండే విధంగా చేస్తున్నారు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాకు సంబంధించిన ఈవెంట్ చాలా గ్రాండ్ నిర్వహించాడు.
ఇక ఈ ఈవెంట్లో మహేష్ బాబు నంది లాంటి ఒక ఫోటో మీద ఎక్కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే వారణాసి అనే గ్లింప్స్ లో మాత్రం నంది మీద ఎక్కి వైల్డ్ లుక్ తో వచ్చే ఒక షార్ట్ రిలీజ్ చేశారు. అందులో భాగంగానే సినిమా టైటిల్ ని కూడా నంది దగ్గరే రివీల్ చేశారు. ఇక మొత్తానికైతే ఏఐ ని వాడి కాశీ లో ఉన్న నందిని ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా ఒక రిపోర్టర్ నందిని కొన్ని ప్రశ్నలు అడిగారు…
మీరు ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అంటే నంది దానికి సమాధానం గా నేను ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాను. ఒకటి త్రేతాయుగంలో పాత్ర కాగా, మరొకటి కలియుగంలో ఉండే క్యారెక్టర్ అని చెప్పింది. అలాగే మీరు మొన్న ఈవెంట్ కి ఎందుకు రాలేదని చెప్తే నేను వస్తే కథ మొత్తం లీక్ అయిపోతోందనే ఉద్దేశ్యంతో దర్శకుడు నన్ను వద్దని చెప్పాడు అంటూ నంది సమాధానం చెప్పింది.
మొత్తానికైతే నంది చెప్పిన సమాధానాలకు ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు ఏఐ ద్వారా అన్ని వీడియోలు క్రియేట్ చేస్తున్నారు అంటూ కొంతమంది ఫైర్ అవుతుంటే… మరికొందరు మాత్రం దానిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు…చూడాలి మరి ‘వారణాసి’ సినిమా మీద ఇప్పటికైతే భారీ హైప్ ఉంది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోందనేది తెలియాల్సి ఉంది…