The Goat’ movie : ‘ది గోట్’ చిత్రంలో యంగ్ విజయ్ పాత్రకు డూప్ గా చేసింది ఎవరో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి!

యంగ్ విజయ్ పాత్ర పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. క్లైమాక్స్ లో క్రికెట్ గ్రౌండ్ స్టేడియం పైన వీళ్లిద్దరి మధ్య బీభత్సమైన పోరాట సన్నివేశం కూడా ఉంటుంది. అయితే యంగ్ విజయ్ పాత్ర కూడా విజయ్ చేసాడు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏజ్ డీ లిమిట్ చేసారు అని అందరూ అనుకున్నారు.

Written By: Vicky, Updated On : September 9, 2024 8:09 pm

Raviteja- Kalyan Ram

Follow us on

The Goat’ movie : తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై సోషల్ మీడియా లో ఎన్నో ట్రోల్ల్స్ ని గత రెండు మూడు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ విజయ్ కి ఉన్న విపరీతమైన స్టార్ డమ్ వల్ల ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడు, ఓవర్సీస్ ప్రాంతాలలో ఈ సినిమాకి కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. నార్త్ అమెరికా లో మొదటి వీకెండ్ లో లియో చిత్రానికి 3.7 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇది మాములు విషయం కాదు. మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాలలో కూడా ఈ సినిమా ఇదే తరహా జోరుని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి వీకెండ్ అన్నీ ప్రాంతాలకు కలిపి 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టిందట. అనేక మంది తమిళ హీరోల ఫుల్ రన్ వసూళ్లను ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే దాటేయడం విశేషం. సోమవారం కూడా ఈ సినిమాకి అనేక ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు లో అయితే ఈరోజు కూడా 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. వచ్చిన టాక్ కి, వస్తున్నా వసూళ్లకు అసలు సంబంధమే లేకుండా తలపతి విజయ్ విలయతాండవం ఆడిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో యంగ్ విజయ్ పాత్ర పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. క్లైమాక్స్ లో క్రికెట్ గ్రౌండ్ స్టేడియం పైన వీళ్లిద్దరి మధ్య బీభత్సమైన పోరాట సన్నివేశం కూడా ఉంటుంది. అయితే యంగ్ విజయ్ పాత్ర కూడా విజయ్ చేసాడు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏజ్ డీ లిమిట్ చేసారు అని అందరూ అనుకున్నారు.

అది నిజమే, కానీ కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే అలా షూట్ చేసారు. ఇద్దరు విజయ్ లు ఒకేసారి స్క్రీన్ మీద కనిపించిన సన్నివేశాలకు మాత్రం డూప్ ని వాడారట. టీనేజ్ లో తలపతి విజయ్ ఎలా ఉండేవాడో, అలాంటి పోలికలు అతి దగ్గరగా ఉన్నటువంటి కుర్రాడిని ఈ పాత్ర కోసం ఎంచుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పుకొచ్చాడు. ఈ పాత్రనే సినిమాకి బాగా మైనస్ అయ్యింది అని రివ్యూస్ లో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దంచికొట్టేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.