Balakrishna: మన టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు రావడంతో, ఈమధ్య ప్రముఖ క్రికెటర్స్ కూడా మన తెలుగు హీరోల మ్యానరిజమ్స్ ని అనుసరించడం మొదలు పెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) నటించిన ‘పుష్ప'(Pushpa Movie) మూవీ మ్యానరిజమ్స్ ని సినీ సెలబ్రిటీస్, క్రికెటర్స్ తో పాటు రాజకీయ నాయకులు కూడా అనుసరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే కాదు,ఇతర టాలీవుడ్ హీరోలను కూడా అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారితో మన ఇండియన్ క్రికెటర్స్ ఫోటోలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా దుబాయి లో జరిగిన ఇండియా వెర్సస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కి మన టాలీవుడ్ నుండి ఎంతోమంది ప్రముఖులు స్టేడియం లో హాజరై మ్యాచ్ ని వీక్షించిన సంగతి తెలిసిందే.
Also Read: హీరోయిన్ రమ్యకృష్ణ తో విడాకులపై మొట్టమొదటిసారి స్పందించిన డైరెక్టర్ కృష్ణ వంశీ!
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సుకుమార్(Director Sukumar), నారా లోకేష్(Nara Lokesh), ఊర్వశి రౌతేలా వంటి వారు ఈ మ్యాచ్ లో మనకి కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి తో పలువురు క్రికెట్ సెలెబ్రిటీలు సెల్ఫీలు కూడా దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కానీ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మాత్రం ఈ మ్యాచ్ కి వచ్చినట్టు మనకు లైవ్ లో ఎక్కడా కనిపించలేదు. కానీ నందమూరి అభిమానులు రీసెంట్ గా బాలయ్య బాబు తో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెల్ఫీ దిగినట్టు ఒక ఫోటో ని అప్లోడ్ చేసారు. ఇది సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. నందమూరి అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇది మా బాలయ్య బాబు రేంజ్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ పరిశీలిస్తే అసలు బాలయ్య బాబు దుబాయి కి రాలేదు,, సోషల్ మీడియా లో వైరల్ అయిన ఫోటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడింది అని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి.
దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఆ ఫోటో ని చూస్తే అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ లాగానే ఉంది. నిజంగా వీళ్లిద్దరు కలిసి సెల్ఫీ తీసుకున్నారంటే, ఎవరైనా నమ్మాల్సిందే . అంత సహజంగా ఆ ఫోటో ఉంది. ఇది చాలా డేంజర్ అని అంటున్నారు విశ్లేషకులు. ఇది సరదాగా క్రియేట్ చేసిన ఫోటో కాబట్టి పర్లేదు, రేపు ఇదే టెక్నాలజీ ని వాడుకొని దుండగులు ఘోరమైన చర్యలు చేస్తే పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగపడేలా ఉండాలి కానీ, నాశనం చేసేలా ఉండకూడదు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలుసుకోవడం చాలా కష్టతరమైనది గా మారొచ్చు. ప్రభుత్వాలకు ఇది పెద్ద సవాల్ గా మారే అవకాశాలు ఉన్నాయి.
Also Read: దేవర 2 లో పెద్ద ఎన్టీయార్ (దేవర) బతికే ఉంటాడా..? అసలు ట్విస్ట్ చెప్పేసిన కొరటాల శివ…