Nandamuri Balakrishna: వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న బాలయ్య బాబు(Nandamuri Balakrishna), ప్రస్తుతం ‘అఖండ 2′(Akhanda 2 Movie) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన ‘అఖండ’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా, ఇంతా కాదు. బాలయ్య, బోయపాటి(Boyapati Srinu) కాంబినేషన్ లో గతంలో సింహా, లెజెండ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా అంటే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండడం సహజమే. ఆ అంచనాలను అందుకోవడం పెద్ద సవాల్. కానీ అఖండ చిత్రం అంచనాలకు మించి ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో మొదలైన బాలయ్య బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ‘అఖండ 2’ చిత్రం ప్రకటించిన రోజు నుండే అంచనాలు తారా స్థాయిలో ఉన్నింది.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, శరవేగంగా షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, రీసెంట్ గానే రెండవ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో ఆది పినిశెట్టి, బాలయ్య బాబు మధ్య వచ్చే ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. సరైనోడు చిత్రం తర్వాత బోయపాటి మళ్ళీ తన సినిమాలో ఆది పినిశెట్టి ని విలన్ గా తీసుకున్నాడు. ఇకపోతే అఖండ పార్ట్ 1 లో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించగా, అఖండ 2 లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త షెడ్యూల్ ని హిమాలయ పర్వతాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో హిమాలయాల్లో కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయట. సెట్స్ వేసి తీసేయొచ్చు కానీ, రియలిస్టిక్ గా అనిపించేందుకు ఒరిజినల్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించుకున్నారట.
అందుకు షూటింగ్ కి అనువైన ప్రదేశాలను రెక్కీ చేయడానికి బోయపాటి శ్రీను & టీం హిమాలయాలకు వెళ్లినట్టు సమాచారం. వచ్చే వారంలోనే ఈ షెడ్యూల్ జరగనుంది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు బాలయ్య బాబు కూడా అసెంబ్లీ కి హాజరయ్యాడు. కానీ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటుండడంతో రాబోయే రోజుల్లో ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇది ఇలా ఉండగా అఖండ 2 చిత్రాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ 25 న దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ దసరా మిస్ అయితే బాలయ్యకు ఎంతో కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.