Nandamuri Balakrishna : పద్మ అవార్డుల( Padma awards ) ప్రధానోత్సవం ఈరోజు ఢిల్లీలో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా పద్మ అవార్డులు అందించనున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కు ఎంపికైన సంగతి తెలిసిందే. దీనికోసం బాలయ్య ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకోవైపు నందమూరి బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్బికె అంటూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు.
Also Read : ఒకే వేదిక పైకి ప్రధాని మోదీ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్!
* సేవలకు గుర్తింపు..
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఒకరు. గత 50 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు. సినీ రంగంతో పాటుగా రాజకీయ రంగం, సామాజిక సేవలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా పద్మభూషణ్ పురస్కార గౌరవం లభించింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వారందరికీ ఈరోజు అవార్డులతో సత్కరించనుంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది.
* ఫుల్ సెలబ్రేషన్స్..
వాస్తవానికి నిన్ననే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులతో కలిసి సెలబ్రేషన్స్( celebrations ) జరుపుకున్నారు. సతీమణి వసుంధర, తనయుడు నందమూరి మోక్షజ్ఞ, కూతురు తేజస్విని, అల్లుడు భరత్ లతోపాటుగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈరోజు పద్మభూషణ్ అందుకుంటున్న తరుణంలో సినీ రాజకీయ రంగ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. #Padmabhushan nbk హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆయన సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.
* గోపీచంద్ మలినేని విషెస్..
బాలకృష్ణతో వీరసింహారెడ్డి( Veera Simha Reddy ) సినిమాను తీసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. వీరిద్దరూ నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం కోసం చేతులు కలపబోతున్నారు. ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చిత్రం రూపొందించే పనిలో ఉన్నారు. మొత్తానికి అయితే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు వెలుస్తున్నాయి.
Also Read : మహేష్ ‘పోకిరి’ కి 19 ఏళ్ళు..’ఉత్తమ్ సింగ్’ పండు గాడు ఎలా అయ్యాడంటే!