https://oktelugu.com/

NBK 109 ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: దయలేని అసురుడు వీడు… బాలయ్య లుక్ కేక!

NBK 109 : మొత్తంగా NBK 109 నుండి వస్తున్న ఒక్కో టీజర్ అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా ఎవరు నటిస్తున్నారు అనేది అధికారికంగా ప్రకటించలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2024 / 12:58 PM IST

    Nandamuri Balakrishna

    Follow us on

    NBK 109 : కొన్నాళ్లుగా బాలకృష్ణకు గోల్డెన్ టైం నడుస్తుంది. అఖండ మూవీతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. నేడు బాలకృష్ణ బర్త్ డే నేపథ్యంలో లేటెస్ట్ మూవీ నుండి టీజర్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ 109వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 వర్కింగ్ టైటిల్ గా మూవీ తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొంత బ్రేక్ పడింది. ఇటీవల తిరిగి ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. 
     
    నేడు విడుదలైన టీజర్ గూస్ బంప్స్ రేపేదిగా ఉంది. మకరంద్ పాండే డైలాగ్స్ NBK 109 లో బాలకృష్ణ క్యారెక్టర్ తీరు చెప్పేవిగా ఉన్నాయి. ”దేవుడు కూడా చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళ్ళను అంతం చేయాలి అంటే… జాలీ , దయ , కరుణ లేని అసురుడు కావాలి” అని బాలకృష్ణను ఉద్దేశించి మకరంద్ పాండే చెప్పడం మనం టీజర్లో చూడొచ్చు. ఇక పొగమంచు తెరల మాటు నుండి బాలకృష్ణ ట్రైన్ దిగి వస్తున్న సీన్ అదిరింది. 
     
    NBK 109 పీరియాడిక్ మూవీ అని ఆ బ్యాగ్రౌండ్, సెటప్ చూస్తే అర్థం అవుతుంది. పీరియాడిక్, కాంటెంపరరీ కలగలిపి సినిమా సిద్ధం చేశారా? లేక అవుట్ అండ్ అవుట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామానా? అనేది తెలియాల్సి ఉంది. NBK 109 చిత్రంలో బాలకృష్ణ లుక్ చాలా బాగుంది. గత చిత్రాల్లో కంటే ఆయన యంగ్ గా కనిపిస్తున్నారు. ఇది చిత్రానికి పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు.
     
    మొత్తంగా NBK 109 నుండి వస్తున్న ఒక్కో టీజర్ అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా ఎవరు నటిస్తున్నారు అనేది అధికారికంగా ప్రకటించలేదు. ఇతర నటుల వివరాలు కూడా వెల్లడించలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరుసగా బాలయ్య చిత్రాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు.