Nandamuri Balakrishna Love Story: ఆయన చెప్పే ప్రతి డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలాగే ఉంటుంది. ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన టాలీవుడ్‌లో వెలుగొందుతున్నారు. ఇప్పటికే ఆయనెవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే నటసింహం బాలకృష్ణ. ఇప్పటికీ ఊర మాస్ సినిమాలతో అలరిస్తున్న ఆయన.. రీసెంట్ గానే అఖండ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని మూవీలో నటిస్తున్నారు. ఇందులో కూడా ఆయన మాస్ పాత్రలోనే కనిపించబోతున్నట్టు పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆయన గురించి ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చెక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ వసుందరతో పెండ్లికి ముందు చెన్నైకి చెందిన ఓ హీరోయిన్‌ను చాలా సిన్సియర్‌గా ప్రేమించారంట.
Also Read: ఏపీ + తెలంగాణ : ‘ఆర్ఆర్ఆర్’ పక్కా బిజినెస్ లెక్కలివే
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వెల్లడించారు. ఆ హీరోయిన్‌తో ప్రేమ విషయం సీనియర్ ఎన్టీఆర్‌కు నచ్చకపోవడంతో వెంటనే పెండ్లి చేయాలని డిసైడ్ అయ్యారంట. దాంతో అప్పటికప్పుడు కాకినాడలో ఉండే తమ బంధువుల అమ్మాయి అయిన వసుంధరను ఇచ్చి పెండ్లి చేసినట్టు చెప్పుకొచ్చారు.

కాగా ఇదే విషయాన్ని బిగ్‌బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ అయిన శ్రీరాపాక కూడా చెప్పుకొచ్చింది. సెట్స్‌లో బాలకృష్ణ చాలా సరదాగా ఉంటారని, ఆయన బోర్ కొట్టినప్పుడు తాను ఓ హీరోయిన్‌ను ప్రేమించిన విషయాన్ని చెప్పుకొచ్చారని బయటపెట్టింది శ్రీ రాపాక. కానీ ఆ హీరోయిన్ పేరు మాత్రం చెప్పలేదు. అయితే వీరందరూ చెబుతున్న దాన్ని బట్టి ఆ హీరోయిన్ కుష్బూ అని అంతా అనుకుంటున్నారు.
Also Read: లేటు వయసులో రెండో పెండ్లి చేసుకోబోతున్న జీన్స్ మూవీ హీరో.. అమ్మాయి ఎవరంటే..?
Recomended Videos