Bheemla Nayak OTT: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్న్యూస్ అందించాయి ప్రముఖ ఓటీటీ లు ఆహా, డిస్నీ హాట్ స్టార్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు ఆహా, డిస్నీ హాట్ స్టార్ లలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీలో మార్పు జరిగింది. ఇందుకు ఒక్కరోజు ముందుగానే ఈ సినిమా రాబోతుంది.

అంటే మార్చి 24న ఆహా, డిస్నీ హాట్ స్టార్ లలో భీమ్లా నాయక్ రచ్చ చేయనున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి 23 రోజులు అవుతున్నా.. కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
Also Read: PM Narendra Modi: షాకింగ్: ప్రధాని మోడీ కేవలం రెండు గంటలే నిద్రపోతారా? నిజమేనా?
పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి మొత్తం రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో వారంలోనే పూర్తి లాభాల్లోకి వెళ్లిపోయింది.
ఇక మూడో వీకెండ్ లోనూ ‘భీమ్లా నాయక్’ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. గత మూడేళ్లుగా పవన్ అభిమానులు ఇలాంటి భారీ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ‘భీమ్లా నాయక్’ అదిరిపోయే ఫుల్ మాస్ ట్రీట్ ను ఇచ్చాడు. మొత్తమ్మీద ‘భీమ్లా నాయక్’ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కూడా ఒక ఊపు ఊపేయబోతున్నాడు.
Also Read: SS Rajamouli RRR Movie: అటు క్రేజ్ ఇటు కాన్ఫిడెన్స్.. మధ్యలో ఆర్ఆర్ఆర్
[…] […]