Homeఎంటర్టైన్మెంట్Bala Krishna: ఆస్పత్రిలో చేరిన నందమూరి బాలకృష్ణ... ఆందోళనలో అభిమానులు

Bala Krishna: ఆస్పత్రిలో చేరిన నందమూరి బాలకృష్ణ… ఆందోళనలో అభిమానులు

Bala Krishna: నందమూరి నట సింహం, టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా బాలకృష్ణ హైదరాబాద్‏ బంజారాహిల్స్‏లోని కేర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. బాలయ్యకు ఈరోజు వైద్యులు సర్జరీ నిర్వహించారు. కుడి చేతి భుజం నొప్పితో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం అందుతుంది. దాదాపు నాలుగు గంటలపాటు సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ఆయన క్షేమంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. బాలకృష్ణ గత ఆరు నెలలుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

nandamuri balakrishna joined in hospital due to shoulder injury

తమతో మాట్లాడుతున్నంతసేపు బాలయ్య తన కుడి చేతిని ఎత్తలేకపోయాడని వైద్యులు అన్నారు. విపరీతమైన నొప్పితో బాలయ్య  బాధపడుతున్నట్లుగా గమనించామని వైద్యులు తెలిపారు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత కేర్ ఆసుపత్రి నిపుణులు డాక్టర్ రఘువీర రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం.. బాలకృష్ణ భుజం కండరాల స్నాయువులను సారి చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ కానున్నారు నందమూరి బాలకృ ష్ణ. ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పిన ట్లు తెలుస్తోంది.

డాక్టర్లు సూచనలతో… నందమూరి బాలకృష్ణ షూటింగ్ కు దూరం కానున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కు ఆపరేషన్ జరిగిందన్న విషయం తెలియగానే.. ఆయన ఫాన్స్ మరియు మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలయ్య తొందరగా కొలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆయన ఫాన్స్. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్స్‌ పేరుతో టాక్ షో చేస్తున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version