Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ” పెద్దన్న ” పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పాలి. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది. అయితే ” పెద్దన్న ” మూవీని దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
అయితే తాజాగా పెద్దన్న సినిమా నుంచి “హాలి హాలి ” పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా లిరికర్ వీడియొ ను రిలీజ్ చేశారు. తెలుగులో ” పెద్దన్న” చిత్ర హక్కులను ఏషియన్ సినిమాస్ రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రజినీకాంత్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ విషయంలో ఆయన అభిమానులంతా ఆనంద పడుతున్న నేపద్యంలో అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ రజినీకాంత్ కావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Evoke your heart with this soothing melody #HaliHali from Super star @rajinikanth 's #Peddhanna
An @immancomposer musical 🎹@directorsiva #Nayanthara @KeerthyOfficial #NarayandasNarang @SBDaggubati @AsianCinemas_ @sunpictures#PeddhannaDeepavali pic.twitter.com/LbUKqD1VJl
— BA Raju's Team (@baraju_SuperHit) November 2, 2021