NBK 111 : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అంటే మన అందరికి గుర్తుకొచ్చేది మాస్. ఆయన కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు అత్యధిక శాతం మాస్ సినిమాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చేసాడు కానీ, అవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు. సైన్స్ ఫిక్షన్, పౌరాణికం నేపథ్యం ఉన్న సినిమాలు కూడా చేసి ఆయన ఆడియన్స్ ని అలరించాడు. ఇలా దాదాపుగా అన్ని రకాల జానర్స్ ని ముట్టుకున్నాడు కానీ, లవ్ స్టోరీ జానర్ లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కెరీర్ ఆరంభం లో కూడా ఆయన కుటుంబ కథా చిత్రాలు, అందులో లవ్ ట్రాక్ ఒక భాగం గా మాత్రమే ఉండేది కానీ, పూర్తి స్థాయి లవ్ స్టోరీ మాత్రం ఆయన చేయలేదు. అయితే ఇప్పుడు ఆ యాంగిల్ లో సరికొత్త ప్రయోగం చేసే పనిలో పడ్డాడు బాలయ్య.
పూర్తి వివరాల్లోకి వెళ్తే తనతో ‘వీర సింహా రెడ్డి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. బాలయ్య తో ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నాను అనే క్లారిటీ పూజ కార్యక్రమం రోజే అభిమానులకు ఇచ్చేసాడు గోపీచంద్. చారిత్రిక నేపథ్యం లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కానీ షాకింగ్ న్యూస్ ఏమిటంటే, ఇది ఒక లవ్ స్టోరీ అట. గౌతమీ పుత్ర శాతకర్ణి తరహా సినిమా కాదట. ఒక చక్కటి ప్రేమ కథ, దాని చుట్టూ జరిగే పరిణామాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. బాలయ్య తో లవ్ స్టోరీ అనే పదమే వినడానికి వింతగా ఉంది కదూ.
ఎన్నో వీరోచితంగా సినిమాలను చేసిన బాలయ్య తో లవ్ స్టోరీ చెయ్యాలని ఎవరైనా అనుకుంటారా?, అది కూడా ఆయనకు 60 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు అనే చెప్పాలి. ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెతో ప్రేమాయణం అంటే ఓకే, ఎక్కడ గోపీచంద్ శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్స్ ని తీసుకొచ్చి బాలయ్య తో లవ్ స్టోరీ చెయ్యిస్తాడో అని అభిమానులు కాస్త ఉలిక్కిపడ్డారు. అయితే కచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు దాదాపుగా కష్టమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సినిమాలు పాతికేళ్ల క్రితం బాలయ్య తో తీస్తే వర్కౌట్ అయ్యేవేమో, కానీ ఇప్పటి తరం ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలను అందిస్తే కచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అవుతుంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య, ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని ఎదురుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు.