https://oktelugu.com/

Liger Movie: లైగర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్న నందమూరి నటసింహం బాలయ్య…

Liger Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖండ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద సింహా గ‌ర్జ‌న చేస్తున్నాడు. మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాడు. ఈ క్ర‌మంలో నందమూరి అభిమానులు, ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు బాలయ్య. కాగా ఇప్పుడు బాలయ్య గురించి ఓ ఆసక్తికర వార్త చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 04:02 PM IST
    Follow us on

    Liger Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖండ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద సింహా గ‌ర్జ‌న చేస్తున్నాడు. మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాడు. ఈ క్ర‌మంలో నందమూరి అభిమానులు, ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు బాలయ్య. కాగా ఇప్పుడు బాలయ్య గురించి ఓ ఆసక్తికర వార్త చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

    రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ “లైగ‌ర్” సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్గా వ‌స్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలానే ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఓ గెస్ట్ రోల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

    ఈ వార్తా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూరికి, బాల‌య్య‌ కాంబోలో వ‌చ్చిన పైసా వ‌సూల్ సినిమా ఓ మోస్తరుగానే ఆడినా బాల‌య్య క్యారెక్ట‌ర్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఫిదా చేసేసింది. ఈ క్ర‌మంలోనే పూరితో బాల‌య్య మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరి మధ్య కూడా మంచి స్నేహ బంధం ఏర్పడింది. దీంతో పూరిపై ఉన్న న‌మ్మ‌కంతో బాల‌య్య లైగ‌ర్‌ సినిమాలో ఓ క్యామియో రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడ‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రానుంది. లైగ‌ర్‌లో బాల‌య్య క‌నిపిస్తే ఇక ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం గ్యారంటీ.