Akhanda Movie: అఖండ మూవీతో కలెక్షన్ల మోత మోగిస్తున్న బాలయ్య… అమెరికాలో రికార్డ్

Akhanda Movie: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం “అఖండ”. ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయ బేరి మోగించింది. గత రెండేళ్లుగా బాలయ్య ఖాతాలో సూపర్ హిట్ సినిమా లేకపోవడంతో మాస్ ఎంటర్టైన్మెంట్ గా భారీ డైలాగ్ లతో థియేటర్ లో జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు అభిమానులు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాల్లో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా […]

Written By: Raghava Rao Gara, Updated On : December 14, 2021 9:35 pm
Follow us on

Akhanda Movie: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం “అఖండ”. ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయ బేరి మోగించింది. గత రెండేళ్లుగా బాలయ్య ఖాతాలో సూపర్ హిట్ సినిమా లేకపోవడంతో మాస్ ఎంటర్టైన్మెంట్ గా భారీ డైలాగ్ లతో థియేటర్ లో జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు అభిమానులు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాల్లో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా “అఖండ” రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అమెరికాలో కూడా బ్రహ్మరథం పడుతున్నారు బాలయ్య బాబు అభిమానులు. తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది “అఖండ” అమెరికాలో ఈ సినిమా మిలియన్ మార్క్ చోటు చేసుకుంది అంట.

తాజాగా ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. అమెరికాలో “అఖండ” మూవీ వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని ఆ సంస్థకు డిస్ట్రిబ్యూషన్ పరంగా అమెరికాలో ఇదే తొలి సినిమా అని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ మొన్నటివరకూ “గౌతమీ పుత్ర శాతకర్ణి” ఉండగా ఆ రికార్డును “అఖండ” చిత్రం కేవలం 10 రోజుల్లో క్రాస్ చేయడం విశేషంగానే చెప్పాలి. “అఖండ” చిత్రంతో బాలకృష్ణ 100 కోట్ల కోట్ల క్ల‌బ్‌లో చేరడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ సందడి చేస్తున్నారు.