F 3 Movie: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం మల్టీస్టారర్ గా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం “ఎఫ్ 2”. ఈ చిత్రానికి సీక్వెల్ గా “ఎఫ్ 3” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతుంది. అయితే 2019 లో సంక్రాంతి కానుకగా విడుదలైన “ఎఫ్ 2″ ఎటువంటి విజయం అందుకున్న ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు థియేటర్ లో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది. అదే తరహా కామెడీ ఎంటర్ టైన్ మెంట్ లో ” ఎఫ్3 “వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకులను అలరించనుంది.
నిన్న వెంకటేశ్ పుట్టినరోజు సందర్బంగా “ఎఫ్ 3” యూనిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెట్స్ లో వెంకీ రియాక్షన్స్ ను కేప్చర్ చేసి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో వెంకీ రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ వినోదాన్ని పండించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరికి అదనంగా సునీల్ కామెడీని మిక్స్ చేసారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే… ఇందులో వెంకీకి రేచీకటి, వరుణ్ కు నత్తి ఉంటాయి అని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో సాగే కామెడీ తో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారని… డబ్బు చుట్టూ తిరిగే కథతో “ఎఫ్ 3” తెరకెక్కుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవలే చెప్పారు.
The Fun, Frustration, Happiness & Swag Shades of our Uber cool @VenkyMama garu from the sets of #F3Movie 😊
Get ready for the Triple Fun Dhamaka😉@IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @Mee_Sunil @ThisIsDSP @SVC_official#HBDVictoryVenkatesh pic.twitter.com/LKPmFgxkrE
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 13, 2021