Homeఎంటర్టైన్మెంట్RRR Movie: చరణ్, తారక్ లను ప్రశంశలతో ముంచెత్తిన స్టార్ హీరో... ఏమన్నాడంటే ?

RRR Movie: చరణ్, తారక్ లను ప్రశంశలతో ముంచెత్తిన స్టార్ హీరో… ఏమన్నాడంటే ?

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్క్శితున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. మెగా, నందమూరి కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలైన రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. డి‌వి‌వి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ని నిర్మించారు. అంతా ఒమిక్రాన్ కనుక ప్రజలపై విరుచుకు పడకపోయి ఉంటె ఈపాటికి ఈ సినిమా హడావిడి మాములుగా ఉండేది కాదు. జనవరి 7 న సినిమా రిలీ అయ్యి రికార్డులు సృష్టించేది. కానీ, కరోనా దెబ్బతో ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

star hero madhavan appreciates charan and tarak about natu natu song in rrr

కానీ రిలీజ్ అయిన నాడు మాత్రం రిక్ర్దులు తిరగ రాస్తుందియ నే నమ్మకం ప్రతి ఒక్కరికీ ఉంది. కాగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సాంగ్ కి కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కూడా ఫిదా అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటల్ని బయటపెట్టారు మాధవన్. ఆ పోస్ట్ లో “నాటు నాటు సాంగ్ ఇప్పుడే యూట్యూబ్ లో చూసాను… చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ , తారక్ మధ్య స్నేహ బంధం నన్ను చాలా అసూయపడేలా చేస్తుంది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మ్యాడీ ట్వీట్ పై ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందిస్తూ థాంక్స్ చెప్పారు.

ఇంక ఈ సినిమా రిలీజ్ చేసి భారతదేశంలో చలనచిత్ర కలెక్షన్లను తిరగరాయనున్నారు అని మాధవన్ అనగా… థియేటర్ సమస్యలు ఉన్నాయని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఆర్ఆర్ఆర్ మూవీ చేసిన వ్యాఖ్యల పట్ల మరోసారి మాధవన్ స్పందిస్తూ… మీరు కచ్చితంగా ఆ సమస్యలను అధిగమిస్తారు … గ్రేట్ నెస్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version