Hari Hara Veeramallu Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్ హీరో సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా దాదాపు 50 సంవత్సరాలుగా మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు. తన తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి అడపాదడప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఆయన చేసిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా జూన్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చెక్కర్లు కొడుతుంది.
నిజానికి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఒక రాబిన్ హుడ్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉన్నవారి దగ్గర కొట్టి లేనివారికి పెట్టే పాత్రలో కనిపిస్తున్నాడట. మొత్తానికైతే ఈ సినిమాలో రెండు సీన్లు హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక 50 మందితో ఫైట్ చేసే సీక్వెన్స్ ఒకటి ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుంది అంటూ మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read : హరి హర వీరమల్లు’ కోసం కోట్లు ఖర్చు చేసిన మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్!
ఇక ఫస్ట్ రివ్యూ లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తూ చెప్పడం విశేషం… ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందట. ఎవ్వరు ఊహించని రేంజ్ లో క్లైమాక్స్ ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి భారీ కలెక్షన్స్ ని సాధించి పెడుతుందని పవన్ కళ్యాణ్ కెరియర్ లో మంచి విజయంగా నిలిచిపోతుంది అంటూ సినిమా మేకర్స్ నుంచి కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఫస్ట్ రివ్యూ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తన ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది.తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం జూన్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే…