Namrata Shirodkar: మహేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమ్రతా శిరోద్కర్ వెండితెరకు గుడ్ బై చెప్పేసి చాలా కాలం అవుతుంది. 2004 తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. మహేష్ కోసం కెరీర్ ని త్యాగం చేసిన ఆమె తెలుగింటి గృహిణిగా మారిపోయారు. మహేష్-నమ్రత లవ్ స్టోరీలో సినిమా తరహా డ్రామా ఉంది. బి గోపాల్ దర్శకత్వంలో వంశీ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో మహేష్ కి జంటగా నమ్రతా శిరోద్కర్ నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
వంశీ మూవీ చివరి షెడ్యూల్ కొరకు ఫారిన్ వెళ్లారట. షూటింగ్ చివరి రోజు ఇద్దరి గుండెల్లో అలజడి మొదలైందట. ఇక రేపటి నుంచి కలుసుకోలేమనే దిగులు కృంగదీసిందట. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం. ఫైనల్ గా మహేషే ఓపెన్ అయ్యాడట. నమ్రతకు ప్రపోజ్ చేశారట. అప్పటికే గుండెల నిండా మహేష్ ని నింపుకొని ఉన్న నమ్రత వెంటనే ఓకే చెప్పేశారట. 2000లో వీరి ప్రేమకథ మొదలైంది.
అయితే 2005లో పెళ్లి జరిగే వరకు ఎవరికీ తెలియదు. మహేష్-నమ్రతల పెళ్లి వార్త అప్పట్లో సంచలనం. అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా మహేష్ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. నమ్రతను ఇంటి కోడలిగా కృష్ణ ఒప్పుకోలేదని, అందుకే నిరాడంబరంగా వివాహం జరిగిందనే వాదన ఉంది.
మహేష్-నమ్రత ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. నమ్రత మంచి భార్యే కాదు సలహాదారు కూడా. మహేష్ కి సంబంధించిన అనేక విషయాలలో నమ్రత ప్రమేయం ఉంటుందట. మహేష్ సక్సెస్ లో నమ్రత పాత్ర కూడా ఉందంటారు. అలాగే ఆమె బెస్ట్ మదర్. ఇక మహేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మిత్రులు చాలా తక్కువ. ఉన్నప్పటికీ కలిసేది అరుదు.
సినిమా, ఫ్యామిలీనే ఆయన ప్రపంచం. ఖాళీగా ఉంటే ఇంట్లో గౌతమ్, సీతారలతో గడుపుతారు. లేదంటే హ్యాపీగా వారితో ఫారిన్ టూర్ కి చెక్కేస్తారు. పరిశ్రమలో మహేష్ వెకేషన్స్ కి వెళ్లినట్లు మరో హీరో వెళ్ళరు. అంతగా ఆయన కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తారు. కొత్త సినిమా షూట్ మొదలయ్యే ముందు విడుదలయ్యాక తప్పకుండా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళతారు. కాగా నమ్రత లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఆ ఫోటోలలో మహేష్ కట్టిన తాళి ప్రత్యేకంగా కనిపించడం విశేషం.