Namrata Shirodkar Assets: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్లు చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ ఉంటుంది. వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులందరు వాళ్ళ ఫ్యామిలీలతో సహా థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ కూడా వస్తుంటాయి… ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి మహేష్ బాబుకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ముఖ్యంగా లేడీస్ లో గాని ఫ్యామిలీ ఆడియన్స్ లో అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమా కూడా ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తుందంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మహేష్ బాబు సినిమాలు చేయడమే కాకుండా యాడ్ ఫిల్మ్స్ చేస్తుంటాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతో చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తాడు.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
ఇప్పటివరకు ఆయన 5000 మందికి పైన చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మహేష్ బాబు అటు సినిమాలు, ఇటు యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బు 3,500 కోట్ల వరకు ఉంటుంది. తన భార్య అయిన నమ్రత మాత్రం బిజినెస్ లో చాలా విపరీతంగా డబ్బులను సంపాదిస్తోంది.
మహేష్ బాబు కంటే ఎక్కువ మనీని ఎర్న్ చేయడంలో ఆమె సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆమె 4,500 కోట్ల ఆస్తికి అధిపతిరాలుగా తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ బాబు కంటే నమ్రతకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి… మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలిసి తమ లైఫ్ ను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ పిల్లలు అయిన గౌతమ్ కృష్ణ, సితార లను కూడా చాలా బాగా చదివిస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళను స్క్రీన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తొందర్లోనే గౌతమ్ కూడా హీరోగా పరిచయం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే అతను యాక్టింగ్ కి సంబంధించిన మెలుకువలు కూడా నేర్చుకుంటున్నాడు. సితార ఫ్యూచర్ లో హీరోయిన్ గా మారుతోందా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది…