https://oktelugu.com/

Pragya Jaiswal: బాలయ్యను మొదటి సారి చూసినప్పుడు నెర్వస్​గా ఫీల్​ అయ్యా.. కానీ ఐదునిమిషాల్లోనే?

Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్​గా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్​ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ద్వరకా క్రియేషన్స్​ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్​ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  అఖండ ప్రమోషన్స్​లో భాగంగా హీరోయిన్​ ప్రగ్యా జైస్వాల్​ మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలేంటో చూద్దాం రండి. తన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 09:08 AM IST
    Follow us on

    Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్​గా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్​ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ద్వరకా క్రియేషన్స్​ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్​ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  అఖండ ప్రమోషన్స్​లో భాగంగా హీరోయిన్​ ప్రగ్యా జైస్వాల్​ మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలేంటో చూద్దాం రండి.

    Pragya Jaiswal Height

    తన సినీ కెరీర్​ గురించి మాట్లాడుతూ.. నటిగా మారాని అనుకున్నప్పుడే మంచి పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  వచ్చిన కథల్లో మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని. అందులో కొన్ని సక్సెస్​ అయినా.. మరికొన్ని ప్రయోగాత్మకంగా మిగిలిపోతయని అన్నారు.

    Also Read: Kamal Haasan: కమల్​హాసన్​ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం

    మరోవైపు, బాలకృష్ణ గురించి స్పందిస్తూ.. ఎంతకాదనుకున్నా.. బాలయ్య సీనియర్​. అంతపెద్ద హీరోతో ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ఇక ఆయన గురించి చెప్పాలంటే.. టైం అంటే టైం. మొదట ఆయనతో కలిసి పనిచేయడానికి ఎంతో నెర్వస్​గా ఫీల్​ అయ్యా.. కానీ, కలిసిన ఐదు నిమిషాల్లోనే చాలా కలిసిపోయారు. ఆయనలాంటి పాజిటివ్​ పర్సన్​ను ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇక ఆయన సెట్స్​లో అడుగుపెడితే చాలు.. అంతా నిశ్శబ్దమే. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయనే తోపు. అని తెలిపింది పగ్యా.

    మరోవైపు సెట్స్​లో జగపతిబాబును చూసి మొదటిరోజు అసలు గుర్తుపట్టలేదని తెలిపింది. బోయపాటి ఆయన్ను అంతలా మార్చేశారని.. జగ్గూబాయ్​ గెటప్​ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. మరి ఇన్ని అంచనాలతో వస్తున్న అఖండ ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.

    Also Read: Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…