https://oktelugu.com/

Mohan Babu vs Nayi Brahmins: మోహన్ బాబును ఇప్పట్లో వదిలేలా లేరు

Mohan Babu vs Nayi Brahmins:  మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుండి మేకప్ మెన్‌ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. ఇతను నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడు. అయితే శ్రీనివాస్ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించి బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. పైగా ఎందుకు గొడవ అని అడిగినందుకు శ్రీనివాస్ పై మోహన్ బాబు బూతులతో విరుచుకు పడ్డారు. దాంతో మళ్ళీ తాజాగా మంచు మోహన్‌బాబు, విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 12, 2022 / 04:18 PM IST
    Follow us on

    Mohan Babu vs Nayi Brahmins:  మోహన్ బాబు దగ్గర పది సంవత్సరాల నుండి మేకప్ మెన్‌ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్‌. ఇతను నాయీ బ్రాహ్మణ కులానికి చెందిన వాడు. అయితే శ్రీనివాస్ పై మోహన్ బాబు వృద్ధ సింహంలా గర్జించి బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. పైగా ఎందుకు గొడవ అని అడిగినందుకు శ్రీనివాస్ పై మోహన్ బాబు బూతులతో విరుచుకు పడ్డారు. దాంతో మళ్ళీ తాజాగా మంచు మోహన్‌బాబు, విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని తూ.గో జిల్లా రాజోలు మండల నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

    Mohan Babu vs Nayi Brahmins

    కాగా ఉప్పాలపు నాగశ్రీను జీవనోపాధి కోసం HYD వెళ్లీ.. సినీ నటుడు మోహన్‌బాబు వద్ద హెయిర్ డ్రెస్స్రర్‌గా పనిచేస్తున్నాడని అన్నారు సంఘం నాయకులు. అతన్ని మోహన్‌బాబు కులంపేరుతో దూషించి, దొంగతనం కేసు పెట్టారని, దొంగతనం నిజమో కాదో తక్షణమే ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

    Also Read:   ‘రాధేశ్యామ్’ సెకండ్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    గతంలో కూడా విజయవాడకు చెందిన నాయీ బ్రాహ్మణ కుల నాయకులు కూడా మోహన్ బాబు ఫ్యామిలీ పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను‌పై దొంగతనం కేసు బనాయించడమే కాకుండా కులం పేరుతో దూషించి తమ మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. ఇంకా కులాల పేరుతో దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ మోహన్ బాబు దగ్గర ఉద్యోగం మానేశాడు.

    Mohan Babu

    కాగా అతను జాబ్ మానేశాడు అని కక్షగట్టి ఎలాంటి నేర నిరూపణ చేయకుండా శ్రీనివాస్ మీద పోలీస్ స్టేషన్లో రూ.5 లక్షల సామగ్రి దొంగిలించాడని కేసు పెట్టారు మోహన్ బాబు టీమ్. ఇక చేసేది ఏమి లేక, శ్రీనివాస్ బయటకు వచ్చి.. జరిగింది మొత్తం వివరించాడు. తమ కులాన్ని తిట్టిన సంగతి కూడా అతను చెప్పాడు. ఇది నాయీ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నదని ఆ కుల నాయకులు చాలా సీరియస్ గా ఉన్నారు. మరి మోహన్ బాబు.. నాయీ బ్రాహ్మణ సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెబుతాడా లేదా అనేది చూడాలి.

    Also Read:  బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !

    Tags