Nageswara Rao Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వర రావు హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడిగా కూడా ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన ఆ తర్వాత తన నట వారసుడిగా నాగార్జునను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్ర ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. ఇక ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూనే, భక్తిరస ప్రధానమైన చిత్రాలను కూడా చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయనకు వరుసగా ఫ్లాప్ లైతే వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలో అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు సైతం తన కొడుకు అయిన వెంకటేష్ ని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని సన్నాహాలు చేశాడం ఇక ఇలాంటి క్రమంలో వెంకటేష్ హీరోగా మారాడు. ఇక నాగార్జున కెరియర్ కి వెంకటేష్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గమనించిన అక్కినేని నాగేశ్వరరావు వెంకటేష్ కంటే తన కొడుకు నాగార్జున స్టార్ హీరోగా ఎదిగేలా కొన్ని ప్రయత్నాలు చేశాడు.
Also Read: రాజమౌళి వాళ్ల నాన్నను అవమానించిన స్టార్ హీరో…అందుకే జక్కన్న ఆ హీరోతో సినిమా చేయడం లేదా..?
అందుకే స్టార్ డైరెక్టర్లతో నాగార్జున సినిమాలను చేయిస్తూ మంచి సక్సెస్ లను సాధింపజేయాలనే ప్రయత్నం చేసినప్పటికి వెంకటేష్ వాళ్ళ ఫాదర్ అయిన రామానాయుడు సైతం టాప్ డైరెక్టర్లతో వెంకటేష్ సినిమాలను చేయించి వెంకటేష్ కి సైతం మంచి సక్సెస్ లను కట్టబెట్టాడు.
వీళ్లిద్దరి మధ్య అప్పట్లో ఒక భీకరమైన పోటీ అయితే నడిచింది. మొత్తానికైతే ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ఫోర్ హీరోల్లో వీళ్లిద్దరూ కూడా ఉండడం విశేషం… నాగేశ్వరరావు మొదట్లో వెంకటేష్ ని కొంతవరకు తక్కువగా అంచనా వేశారట. వెంకటేష్ హీరో అవ్వడం ఏంటి హీరో అయిన నా కొడుకు నాగార్జున స్టార్ హీరో అవుతాడు కానీ వెంకటేష్ ఎలా హీరో అవుతాడు అంటూ తన సన్నిహితుల దగ్గర కొన్ని మాటలు కూడా చెప్పినట్టుగా అప్పట్లో కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి.
Also Read: బాలయ్య చేసిన ఆ ఒక్క సినిమా ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిందా..?
మరి మొత్తానికైతే వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ఎదగడం వెంకటేష్ వాళ్ళ చెల్లిని నాగార్జున పెళ్లి చేసుకోవడం వాళ్ళకి నాగచైతన్య జన్మించిన తర్వాత ఇద్దరు విడిపోవడం అనేది చక చక జరిగిపోయాయి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. నాగార్జున, వెంకటేష్ కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటూ వాళ్ళ సినిమాల గురించి వాళ్ళు చేయబోయే పాత్రల గురించి చర్చించుకుంటూ ఉంటారు…