Nagarjuna statement on Dhurandhar: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) టాలీవుడ్ లో టాప్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న రోజుల్లోనే, ప్రయోగాలు చేయడానికి ఏనాడూ వెన్ను చూపలేదు. ఆయన చేసిన ప్రయోగాలు అత్యధిక శాతం సక్సెస్ అయ్యాయి కూడా. సినిమాల పరంగా ప్రయోగాలు మాత్రమే కాదు, పాత్రల పరంగా కూడా ఆయన చాలా ప్రయోగాలే చేసాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఆరోజుల్లోనే మంచి గుర్తింపు ని సంపాదించుకున్నప్పటికీ, మంచి క్యారెక్టర్ దొరికితే చేయకుండా ఎన్నడూ ఉండలేదు. ఇప్పుడు కూడా ఆయన అదే ఫార్ములా ని అనుసరిస్తూ వస్తున్నాడు. ఆ కారణం చేతనే గత ఏడాది ఆయన నుండి ‘కుబేర’, ‘కూలీ’ వంటి చిత్రాలు వచ్చాయి. కుబేర చిత్రం అభిమానులను సంతృప్తి పరిచింది కానీ, కూలీ చిత్రం మాత్రం ఫ్యాన్స్ ని తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. నాగార్జున ని విలన్ రోల్ లో చూడలేకపోయారు అభిమానులు.
మొదట్లో నాగార్జున విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని న్యూస్ రాగానే ‘ధృవ’ సినిమాలో అరవింద్ గో స్వామి లాంటి క్యారెక్టర్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ రెగ్యులర్ విలన్ రోల్ చేయడం తో అసలు జీర్ణించుకోలేకపోయారు. పైగా రీసెంట్ గా సోషల్ మీడియా లో ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం లోని విలన్ క్యారెక్టర్ రెహ్మాన్ డెకాయిట్ పాత్ర కోసం ముందుగా నాగార్జున నే సంప్రదించారని, కానీ ఆయన కూలీ మూవీ డేట్స్ ని కేటాయించడం వల్ల ఈ చిత్రాన్ని చేయలేకపోయాడంటూ ప్రచారం సాగడం తో అభిమానుల రక్తం ఇంకా మరిగిపోయింది. ఎందుకంటే ఈ చిత్రం లో హీరో పాత్ర కంటే ఎక్కువగా రెహ్మాన్ డెకాయిట్ పాత్రకే ఎక్కువ పేరొచ్చింది. ఒక విధంగా ఆ సినిమా అంత పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడానికి కారణమే ఆ పాత్ర అనొచ్చు . అలాంటి పాత్రని మిస్ అయ్యినందుకు అభిమానులు చాలా ఫీల్ అయ్యారు.
అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అక్కినేని నాగార్జున ని విలేఖరి ఒక ప్రశ్నఅడుగుతూ ‘ధురంధర్ లోని విలన్ క్యారెక్టర్ కోసం ముందుగా మిమ్మల్ని సంప్రదించారట కదా మేకర్స్?’ అని అడిగిన ప్రశ్నకు నాగార్జున సమాధానం చెప్తూ ‘అందులో ఎలాంటి నిజం లేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు. కానీ నాకు ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య డర్ సినిమాలంటే బాగా ఇష్టం. ‘ధురంధర్’ ముందు ఆయన నుండి విడుదలైన URI చిత్రాన్ని చూసాను. గూస్ బంప్స్ అనిపించింది. ధురంధర్ చిత్రం కూడా అద్భుతంగా ఉంది . ఈ సినిమాలోని నటీనటులంతా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటన సినిమాకే పెద్ద హైలైట్ గా నిల్చింది. ‘ధురంధర్ 2′ కోసం అందరి లాగానే నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా మొదటి భాగం కంటే పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.