Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్స్ కి బదులుగా చీఫ్స్ ని పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రెండు వారాలు కేవలం ముగ్గురు చీఫ్స్ ని మాత్రమే చూస్తూ వచ్చాము. నిఖిల్, యష్మీ మరియు నైనిక చీఫ్స్ గా వ్యవహరించారు. వీళ్ళు ‘అఖండ’, ‘కెరటం’, ‘అంతులేని వీరులు’ అనే టీమ్స్ కి ఆధిపత్యం వ్యవహరించారు. ఇక వీళ్ళు మాత్రమే చీఫ్స్ గా ఉంటారా?, మిగతా వాళ్లకు అవకాశం ఇవ్వరా?, యష్మీ ఎలాంటి టాస్కులు ఆడకుండా లక్ తో చీఫ్ అయ్యింది. ఆమె ప్రవర్తన ని చూడలేకపోతున్నాము, చీఫ్ నుండి తొలగించి నామినేషన్స్ లో పెట్టండి, ఆమెని వెంటనే బయటకి తొయ్యాలి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ సందర్భం రానే వచ్చింది అని చెప్పాలి. నేటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లో ఉన్న ముగ్గురు చీఫ్స్ ని తొలగించాడు. అంతే కాదు వాళ్లకి సంబంధించిన క్లాన్స్ కూడా ఇక ఉండవట. అంటే రేపటి నుండి హౌస్ లో కొత్త చీఫ్స్ కోసం పోటీ జరగబోతుంది. యష్మీ చేసిన ఓవర్ యాక్షన్ కి ఆమెని హౌస్ మేట్స్ అందరూ నామినేట్ చేస్తారు. కచ్చితంగా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ నామినేషన్స్ కి వచ్చిన తర్వాత ఆమెలో ఏమైనా మార్పులు వచ్చి, టాస్కులు బాగా ఆడి, కాస్త మనిషిలాగ ప్రవర్తిస్తే ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చు.
అలా కాకుండా నామినేషన్స్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహా ప్రవర్తన తో కొనసాగితే మాత్రం ఆమెని బయటకి గెంటెందుకు ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. నేడు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున శేఖర్ బాషా భార్య కి డెలివరీ అయిన శుభ వార్తని తెలియచేసాడు. శేఖర్ బాషా ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నప్పటికీ, ఎప్పుడూ కూడా ఆయన తన భార్య గర్భవతి అనే విషయాన్నీ బయట పెట్టి, సానుభూతి కోసం వాడుకోలేదు. ఇంత నిజాయితీ గల కంటెస్టెంట్ ఎలిమినేట్ అనగానే ఈ సీజన్ మీద సగానికి పైగా ఆడియన్స్ కి ఆసక్తి పోయింది.
ఎంటర్టైన్మెంట్ ని పంచే ఏకైక కంటెస్టెంట్ ని తరిమేస్తున్నారు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి కొంతమంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారని, వారిలో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా ఉంటాడని, శేఖర్ బాషా లేని లోటుని ఆయన పూడుస్తాడని మరికొందరు అంటున్నారు. అవినాష్ తో ఇద్దరు పాత కంటెస్టెంట్లు, ముగ్గురు కొత్త కంటెస్టెంట్లు, మొత్తం కలిపి ఆరు మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సెప్టెంబర్ 21 న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ద్వారా రాబోతున్నారట.