Nagarjuna Geethanjali Heroine: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆల్ టైం క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న చిత్రం ‘గీతాంజలి'(Geethanjalo). మణిరత్నం(Maniratnam) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. కేవలం తెలుగు లోనే కాదు,తమిళం లో కూడా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రీసెంట్ గా నాగార్జున జీ తెలుగు లో మొదలైన జగపతి బాబు(Jagapathi Babu) ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) ప్రోగ్రాం కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి, ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. విక్రమ్ తర్వాత వరుసగా 7 సినిమాలు చేశానని, కొన్ని చిత్రాలు ఆడాయి కానీ, నాకు నటుడిగా ఎలాంటి గుర్తింపుని తీసుకొని రాలేదని, కేవలం నాగేశ్వర రావు గారి అబ్బాయిగానే నన్ను జనాలు చూసారని, ఆ సమయం లో మణిరత్నం తో పని చెయ్యాలని పట్టుబట్టి, ఆయన వెంట ప్రతీ రోజు తిరిగి, ఈ సినిమాని ఒప్పించి చేశానని, నటుడిగా ఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది చెప్పుకొచ్చాడు నాగార్జున.
Also Read: ఏకంగా ఇండియానే దున్నేసింది.. ఆ తర్వాత మాయమైపోయింది.. 17,000 కోట్ల కంపెనీ చరిత్ర తెలుసా!
ఇకపోతే ఈ సినిమాలో ఎంతో చలాకీగా నటించిన హీరోయిన్ గిరిజ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమెకు ఇది మొట్టమొదటి సినిమా, అయినప్పటికీ చాలా అద్భుతంగా, సహజంగా నటించింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు, పెద్ద హీరోయిన్ అయిపోతుందని ప్రేక్షకులు ఊహించారు, కానీ ఆమె కేవలం కొన్ని సెలెక్టెడ్ చిత్రాలు మాత్రమే చేసింది. ‘గీతాంజలి’ తర్వాత మలయాళం లో రెండు సినిమాలు చేసిన గిరిజ, ఆ తర్వాత హిందీ లో ఒక సినిమా చేసింది. మళ్ళీ 2002 వ సంవత్సరం లో ఆమె ‘హృదయాంజలి’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత హిందీ లో ఒక సినిమాలో అతిథి పాత్ర చేసింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది, మళ్ళీ ఈమె చాలా కాలం తర్వాత ‘ఇబ్బని తబ్బిదా ఇలేయాలి’ అనే చిత్రం లో స్పెషల్ క్యారక్టర్ చేసింది. అయితే రీసెంట్ గా నాగార్జున పాల్గొన్న ‘జయమ్ము నిశ్చయ్యమ్మురా’ ప్రోగ్రాం లో హోస్ట్ జగపతి బాబు నాగార్జున కి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ, గిరిజ తో వీడియో బైట్ ఇప్పించాడు. ఈ వీడియో లో గిరిజ లుక్ ని చూసి నాగార్జున షాక్ కి గురయ్యాడు. ఆ తర్వాత ఆమె మాట్లాడిన మాటలను ఆయనకు ఎంతో సంతోషాన్ని అందించాయి.
గిరిజ మాట్లాడుతూ ‘నాగార్జున కి దయాగుణం ఎక్కువ, చాలా సౌమ్యుడు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఎంత సౌమ్యుడో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ‘గీతాంజలి’ సినిమా విడుదల తర్వాత ఆయన నాకు ఆయన ఒక రోజు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసాడు. ఆయన మాటల్లో సినిమా పెద్ద హిట్ అయ్యింది అనే ఆనందం కనపడలేదు,చాలా సౌమ్యంగా తెలిపాడు, ఇప్పటికీ నేను ఆ సంఘటన ని మర్చిపోలేను. అలా ఆయనతో నాకు ఎన్నో సర్ప్రైజ్ కి గురి చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆయన నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను, ఇంత మంచి వ్యక్తి తో కలిసి నటించడం నాకు జీవితం లో ఎప్పుడూ మర్చిపోలేని అనుభూతి, థాంక్యూ నాగార్జున, నిన్ను ఈరోజు లెజెండ్ స్థాయిలో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.