Nagarjuna vs Dhanush Fight: ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర'(Kuberaa Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ధనుష్, నాగార్జున కాంబినేషన్ వెండితెర పై మెరిసిపోతుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా చక్కగా కుదిరింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోపు ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ, నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో కానీ, ధనుష్ గురించి నాగార్జున చాలా గొప్పగా మాట్లాడాడు కానీ, ధనుష్ మాత్రం నాగార్జున గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది అక్కినేని అభిమానులకు బాగా బాధని కలిగించింది. ఎందుకు ధనుష్ ఇలా నాగార్జున ని పట్టించుకోలేదు, గతంలో వీళ్ళ మధ్య ఏమైనా వైరం నడిచిందా వంటి సందేహాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి.
అయితే ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళ మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ నడిచిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పట్లో ధనుష్ హీరో గా నాగార్జున ప్రధాన పాత్రలో తమిళం లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉందట. నాగార్జున కి ఆ సినిమా స్టోరీ మరియు తన పాత్ర బాగా నచ్చడం తో ఆ సినిమాకు కావాల్సినన్ని డేట్స్ కేటాయించాడు. ఈ చిత్రం కోసం తాను సోలో హీరో గా తెలుగు లో చేయాల్సిన ఒక సినిమాని కూడా దూరంగా పెట్టి డేట్స్ ని కేటాయించాడు. అంత విలువని ఇస్తూ డేట్స్ కేటాయిస్తే ఆ ప్రాజెక్ట్ కేవలం ధనుష్ కారణంగానే క్యాన్సిల్ అయ్యిందట. దీంతో తన డేట్స్ అనవసరం గా వృధా అయ్యాయి అని నాగార్జున అప్పట్లో ధనుష్ పై బాగా సీరియస్ అయ్యాడట. దీనిపై వీళ్లిద్దరి మధ్య చిన్న కోల్డ్ వార్ నడిచిందని తెలుస్తుంది.
Also Read: Balayya vs Nagarjuna Controversy: ఆ సినిమా వల్లే బాలయ్య – నాగార్జున ల మధ్య వివాదం ఏర్పడిందా..?
ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రెండు మూడు సార్లు నటించే అవకాశం వచ్చినప్పటికీ నాగార్జున ఒప్పుకోలేదట. ఇది జరిగి చాలా ఏళ్ళు గడిచిన తర్వాత ‘కుబేర’ ప్రపోజల్ వచ్చింది. తన క్యారక్టర్ చాలా బాగా ఉండడం తో పాటు, ధనుష్ క్యారక్టర్ ని అతను తప్ప మరొకరు చెయ్యలేరు అనే విధంగా ఉండడంతో పాత గొడవలు మొత్తం మర్చిపోయి ఈ సినిమా చేయడానికి నాగార్జున ఒప్పుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ధనుష్ పాత గొడవలు మనసులో పెట్టుకొని నాగార్జునకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది కాసేపు పక్కన పెడితే, నాగార్జున, ధనుష్ కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద చాలా బాగుంది. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.