https://oktelugu.com/

Bigg Boss Telugu 8: యష్మీ, మణికంఠ ని పొగడ్తలతో ముంచెత్తిన నాగార్జున..గౌతమ్ ని ఏకిపారేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్..నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో గుర్తించుకోదగ్గ సంఘటనలు పెద్దగా ఏమి జరగలేదు. హోటల్ టాస్క్ అంతంత మాత్రం గానే జరిగింది. కానీ ప్రేరణ, నభీల్ మధ్య జరిగిన గొడవలు హైలైట్ గా నిలిచాయి. అంతే కాకుండా ఈ వారం మణికంఠ ఎమోషనల్ డ్రామాలు బాగా తగ్గించి, టాస్కులు ఆడడం పై ఫోకస్ పెట్టాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 09:28 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో గుర్తించుకోదగ్గ సంఘటనలు పెద్దగా ఏమి జరగలేదు. హోటల్ టాస్క్ అంతంత మాత్రం గానే జరిగింది. కానీ ప్రేరణ, నభీల్ మధ్య జరిగిన గొడవలు హైలైట్ గా నిలిచాయి. అంతే కాకుండా ఈ వారం మణికంఠ ఎమోషనల్ డ్రామాలు బాగా తగ్గించి, టాస్కులు ఆడడం పై ఫోకస్ పెట్టాడు. కానీ వైల్డ్ కార్డు లేడీ కంటెస్టెంట్స్ తో మళ్ళీ హగ్గులు మొదలు పెట్టాడు. ఇక యష్మీ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ వారం ఆమెకు బెస్ట్ పెరఫార్మెర్ ఆఫ్ ది హౌస్ ట్యాగ్ ని కళ్ళు మూసుకొని ఇచ్చేయొచ్చు. నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాకొచ్చిన సమాచారం ప్రకారం మీకు తెలియచేస్తున్నాము.

    ముందుగా నాగార్జున యష్మీ, మణికంఠ ఆట తీరుని మెచ్చుకొని పొగడ్తలతో ముంచి ఎత్తినట్టు తెలుస్తుంది. గత వారం మణికంఠ కి నాగార్జున నుండి, హౌస్ మేట్స్ నుండి ఏ స్థాయిలో కోటింగ్ పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ కోటింగ్ తర్వాత మణికంఠ లో అనూహ్యమైన మార్పులు కనిపించాయి, అందుకు కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇక హౌస్ కి కొత్త మెగా చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మెహబూబ్ కి శుభాకాంక్షలు తెలియచేసాడు, కానీ అతని ఆట తీరుని మాత్రం మెచ్చుకోలేదు, నేను చూసిన మెహబూబ్ ఇది కాదు, నీ నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే నిఖిల్ కి కూడా నాగార్జున నుండి కోటింగ్ పడింది. నీలో ఫైర్ బాగా తగ్గిపోయింది, మాకు ఫైర్ కావాలి అని అడుగుతాడు నాగార్జున. అలాగే నిఖిల్, సీత ఆడిన దొంగ ఆటలకు సంబంధించిన వీడియోస్ ని నాగార్జున ప్లే చేసాడు. ఇక హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా అడుగుపెట్టిన గత సీజన్ టాప్ కంటెస్టెంట్ గౌతమ్ కి కూడా చాలా బలమైన కోటింగ్ పడింది.

    అవినాష్ తో జరిగిన చిన్న గొడవలో అదుపు తప్పిన గౌతమ్ మైక్ విసిరికొట్టి హౌస్ లోపలకు కోపం గా వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో గౌతమ్ ఎమోషన్ లో నిజాయితీ ఉంది, అంత వరకు కరెక్టే, కానీ మైక్ విసిరిగొట్టడం తప్పు, అందుకు నాగార్జున నుండి పడాల్సినవి పడ్డాయి. అలాగే సీజన్ 7 లో గౌతమ్ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బ్రాండ్ ఊరికే రాలేదు, అద్భుతంగా ఆడబట్టే వచ్చింది, 13వ వారం వరకు అతన్ని హౌస్ లో కొనసాగేలా చేసింది. కానీ అప్పటి గౌతమ్ ఆట తీరు, ఈ సీజన్ లో కనిపించడం లేదని, మాకు పాత గౌతమ్ కావాలని నాగార్జున అంటాడు, మరి దీనికి గౌతమ్ వైపు నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చింది అనేది నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి.

    Tags