Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున కొన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినప్పటికి ఆయనకు అనుకున్న రేంజ్ లో సక్సెసులైతే రాలేదు. ఇంకా పెద్ద కొడుకు అయిన నాగచైతన్య అడపాదడప సక్సెస్ లను సాధిస్తూ కెరియర్ ను ముందుకు లాగిస్తున్నాడు. తన చిన్న కొడుకు అయిన అఖిల్ విషయంలో మాత్రం నాగార్జున చాలా వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఖిల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయిన కూడా ఇప్పటి వరకు తనకు చెప్పుకోడానికి ఒక్క సాలిడ్ సక్సెస్ కూడా లేదంటే ఆయననుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతలా నిరాశపరుస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ లతో ‘లెనిన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా నాగార్జున ఈ సినిమాని చూశానని సినిమా అద్భుతంగా వచ్చిందని ఒక ట్వీట్ చేశాడు. ఇక దాని మీద విభిన్నమైన కథనాలైతే వెలువడుతున్నాయి.
దీని మీద హైప్ తీసుకురావడానికి నాగార్జున ఇలా చేశారని కొందరు అంటుంటే, నిజంగానే సినిమా బాగుంది కాబట్టి నాగార్జున అలా చెప్పాడు అని అక్కినేని అభిమానులు దానిని సమర్థిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా లెనిన్ సినిమా మీద ఇప్పటివరకు ఏ హైప్ లేదు. కాబట్టి ఆ సినిమా నుంచి ఒక ట్రైలర్ ని వదిలితే గాని సినిమా మీద హైట్ క్రియేట్ అయ్యే విధంగా కనిపించడం లేదు.
మరి ఈ సినిమా అఖిల్ కెరీర్ ను నిలబెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ మూవీని జూన్ నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… అన్ని అనుకున్నట్టుగా జరిగితే మాత్రం అఖిల్ కి భారీ సక్సెస్ దక్కుతుంది…లేకపోతే ఇక తన సినిమా కెరియర్ కష్టమనే చెప్పాలి…